మహాత్మా గాంధీ గురించి ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌..! అసలు ఆరోజే ఎందుకు దీక్ష చేశారు..?

-

ఫ్రీడమ్‌ మూమెంట్‌ అంటే మనకు ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల పేర్లు గుర్తుకువస్తాయి. దేశ స్వాతంత్ర్య ఉద్యమం అంటే చిన్న కథ కాదు. మనకు తెలిసింది కొంతే.. తెలుసుకోవాల్సించి చాలా ఉంది. అసలు ఆ రోజు ఏం జరిగింది.. గాంధీ గారు ఆరోజే ఎందుకు దీక్ష చేశారు. కత్తులు, తుపాకీలు, రక్తపు మరకలతో నిండిపోయిన ప్రపంచ చరిత్రలో అహింసా మార్గంలో కూడా దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావచ్చని నిరూపించిన మహానుభావుడు.. మన మహాత్ముడు. ఆయనకు మహాత్మా అనే పేరు ఎలా వచ్చింది, ఆయన వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.!

ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడు..

ఓ సందర్భంలో రైలు దిగుతుండగా.. గాంధీ కాలికి ఉన్న ఒక చెప్పు ట్రాక్పై పడిపోయింది. వెంటనే ఆయన మరో కాలికి ఉన్న చెప్పును కూడా పడేశారు. ఎవరికైతే ఒక చెప్పు దొరుకుతుందో, రెండోది కూడా తీసుకుంటారని ఆయన అలా చేశారు. యుక్త వయస్సులో గాంధీకి చాలా సిగ్గు ఎక్కువ. మరీ ముఖ్యంగా స్టేజ్పైన మాట్లాడాలన్నా, ఏదైనా విషయంపై వాదించాలన్నా భయపడిపోయేవారు. లండన్ వెజిటేరియన్ సొసైటీలో ఓసారి ఓ అంశంపై చర్చ జరిగింది. అందులో గాంధీ మాట్లాడాల్సి ఉంది. కానీ ఆయన నోటి నుంచి మాటలు రాలేదు. పక్కనే ఉన్న వ్యక్తి చేత తన వాదనను వినిపించారు. లాయర్ వృత్తి తొలినాళ్లల్లో కూడా ఇదే పరిస్థితి. ఓ కేసులో భాగంగా ఓ సాక్షిని విచారించాల్సి ఉంది. కానీ గాంధీ చాలా తడబడ్డాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసి, కేసు ఫీజును వెనక్కి తిరిగిచ్చేశారట. టైమ్ మ్యాగజైన్ ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు చాలా ప్రతిష్ఠాత్మకమైనది. 1930లో ఈ అవార్డు గాంధీని వరించింది. ఉప్పు సత్యాగ్రహం నేపథ్యంలో ఈ అవార్డు ఇచ్చారు. ఇప్పటికీ.. ఈ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడు గాంధీనే కావడం విశేషం.

నోబెల్ పురస్కారం..

సౌతాఫ్రికాలో ఉండగా 1906లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా యుద్ధం జరిగింది. దీనిని బంబాథ అప్స్ప్రింగ్ అంటారు. ఇందులో గాయపడిన బ్రటీష్ సైనికులకు గాంధీ సాయం చేశారు. మహాత్మా గాంధీ రాసిన ఆటోబయోగ్రఫీ పేరు “మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్”. ఇది 1927లో పబ్లీష్ అయ్యింది. 20వ శతాబ్దాంలో 100 మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిట్చ్యువల్ (ఆధ్యాత్మిక) పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది ఈ బుక్. నోబెల్ పురస్కారానికి గాంధీ పేరు సుమారు ఐదు సార్లు సిఫార్సు చేశారు. కానీ ఒక్కసారి కూడా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. చివరిగా 1948లో పురస్కారానికి నామినేట్ అయ్యారు. కానీ ఆయన హత్య నేపథ్యంలో ఆ ఏడాది ఆ బహుమతిని ఎవరికీ ఇవ్వలేదు. ‘ప్రస్తుతం ఈ అవార్డుకు అర్హులెవరూ జీవించి లేరు,’ అంటూ ఆ ఏడాది బహుమతిని నిలిపివేశారు.

ఐరిష్ యాక్సెంట్లో గాంధీజీ ఇంగ్లీష్లో మాట్లాడేవారు. ఆయన మొదటి ఇంగ్లీష్ టీచర్ ఓ ఐరిష్ వ్యక్తి కావడంతో గాంధీకి కూడా అదే యాక్సెంట్ వచ్చింది. గాంధీజి పుట్టింది శుక్రవారం నాడు. ఆయన మరణించింది శుక్రవారం నాడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కూడా శుక్రవారమే కావడం విశేషం. మన కరెన్సీపై గాంధీ బొమ్మ ఉంటుంది. దానిని ఎవరో గీశారని అనుకుంటాము. కానీ అది నిజమైన ఫొటో! 1946లో అప్పటి వైస్రాయ్ హౌజ్ (నేటి రాష్ట్రపతి భవన్)లో ఓ వ్యక్తి తీసిన ఫొటో అది. గాంధీజీకి ఫొటోలు దిగడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఆ కాలంలో ఇతరులతో పోల్చుకుంటే.. ఆయన ఫొటోలే ఎక్కువగా ఉండేవి, కనిపించేవి.

గాంధీకి “మహాత్మా” అన్న బిరుదును రవింద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు. ఓసారి ఠాగూర్ను కలిసిన గాంధీజీ.. ‘నమస్తే గురుదేవ్’ అని సంబోధించారు. అందుకు బదులుగా.. “నేను గురుదేవ్ అయితే మీరు మహాత్ముడు” అని ఠాగూర్ అన్నారు. 1921లో ఆడంబరాలను వదులుకున్నారు గాంధీ. మధురై పర్యటన నేపథ్యంలో ధోతీ ఒక్కటే వేసుకున్న చాలా మంది భారతీయులను చూసిన తర్వాత గాంధీ చాలా బాధపడ్డారట. ఆ తర్వాత జీవితం మొత్తం ఆయన కూడా అలాంటి దుస్తులే ధరించాలని నిర్ణయించుకుని అదే ఫాలో అయ్యారు..

ఆ రోజు నిరాహార దీక్ష ఎందుకు..?

1947 ఆగస్ట్ 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆ సమయంలో కోల్కతాలో గాంధీ నిరాహార దీక్షలో కూర్చున్నారు. భారత్- పాకిస్థాన్ విభజనకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 1944లో గాంధీజీని దశపిత (జాతి పిత)గా సంబోధించారు సుభాష్ చంద్రబోస్. 1947లో సరోజినీ నాయుడు కూడా ఇదే మాట అన్నారు. ఆ తర్వాత.. మహాత్ముడికి భారత దేశ జాతిపితగా అధికారిక గుర్తింపు వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version