రాఖీ పండుగ (ఆగష్టు9) ఎంతో విశేషమైనది! ఆరోజు ఏ సమయానికి కట్టాలో తెలుసా?

-

ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగ జరుపుకుంటారు.ఈరోజును అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్లు వారి ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. ఈ రక్షాబంధన్ పండుగ ఈ సంవత్సరం ఆగష్టు 9వ తేదీన శనివారం నాడు జరుపుకోనున్నారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి వారి ఆయుష్షును, ఆరోగ్యాన్ని, సంతోషం కోసం ప్రార్థిస్తారు. సోదరులు తమ సోదరికి అండగా ఉంటామని వాగ్దానం చేస్తారు. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 8వ తేదీన కూడా రాఖీ కట్టడానికి పౌర్ణమి ఘడియలు ఉన్నందున అసలు ఏ తేదీలో రాఖీ జరుపుకోవాలని సందిగ్ధం నెలకొంది. మరి ఎప్పుడు జరుపుకోవాలి? ఏ సమయంలో రాఖీ కట్టాలి? ఈ సంవత్సరం ఎందుకు ప్రేత్యేకం అయినది గా భావిస్తున్నారో.. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ..

రాఖీ కట్టే శుభ సమయం : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాఖీ కట్టడానికి శుభముహూర్తం చాలా ముఖ్యం 2025లో రాఖీ పండుగ రోజున రోజు మొత్తం అనుకూల సమయంగా పరిగణించబడుతుంది. అయితే పండితులు సూచించిన శుభ సమయాలను మనము ఒకసారి తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమి ఆగస్టు 9న వచ్చింది. పౌర్ణమి తిధి ఆగస్టు 8 వతేదీ మధ్యాహ్నం 2గంటల నుండి ప్రారంభమవుతుంది మరుసటి రోజు మధ్యాహ్నం అంటే ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నం 1:24 నిమిషాల కు ముగుస్తుంది. ఇక శనివారం రోజున ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1: 20 నిమిషాల లోపు రాఖీ కట్టేందుకు శుభ సమయం అని పండితులు చెబుతున్నారు. ఇక ఆరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:00 వరకు అభిజిత్ ముహూర్తం నడుస్తుంది .ఇది చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక కుదరని వారు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల లోపు రాఖీ కట్టవచ్చని సూచిస్తున్నారు.

Rakhi Festival Why It’s So Special and When to Tie It!

ఈ సంవత్సరం ఎందుకు ప్రేత్యేకం: ఈ పండుగ 95 సంవత్సరాల తరువాత మళ్లీ ఆగస్టు 9న గ్రహాల సంచారం పునరావృత్తం కావడం వలన ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ సమయాల్లో రాఖీ కట్టడం వలన సోదరులకు శుభ ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ ఏడాది మూడు శుభయోగాలు రాఖీ పౌర్ణమి రోజున రావడం విశేషం. అవి సౌభాగ్య యోగం, శోభనయోగం, సర్వార్థి సిద్ది యోగం ఇవి ఏర్పడుతున్నందున ఈ పండుకు మరింత విశిష్టత నెలకొంది.అంతేకాక శనివారం ఆగష్టు 9 న శ్రావణ నక్షత్రం లో పండుగ రావటం విశేషం.

రాఖీ పండుగ రోజున సోదరీమణులు ఉదయాన్నే స్నానం చేసి ఇంటిని పూలమాలలతో అలంకరించి ఒక పళ్ళెము లో రాఖి, అక్షింతలు, కుంకుమ, దీపం, మిఠాయి సిద్ధం చేసుకుని, లక్ష్మీనారాయణకు, పార్వతీ పరమేశ్వరులకు, పూజ చేసి సోదరుడి కుడి చేతి మణికట్టుపై రాఖీని కట్టాలి. ఇలా రాఖీ కట్టడం సోదరుడికి దీర్ఘాయుష్షును, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని అందిస్తుంది. సోదరుడికి హారతి ఇచ్చి బొట్టు పెట్టి మిఠాయి తినిపించాలి. సోదరుడు సోదరికి కానుకలు బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ.

రాఖీ పండుగ అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ల మధ్య ప్రేమ గౌరవం రక్షణ బంధాన్ని మరింత పెంచే అద్భుతమైన సందర్భం. 2025 లో ఆగస్టు 9న ఈ పండుగను శుభముహూర్తంలో జరుపుకోవడం సోదర సోదరీమణుల సంబంధం మరింత దృఢమవుతుంది.ఈ పవిత్ర బంధాన్ని రాఖీ కట్టి మీ సోదరుడితో ఆనందంగా జరుపుకోండి.

గమనిక:(పైన తెలియజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే)

Read more RELATED
Recommended to you

Latest news