యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలోనే యాంకర్ గా తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఇతడు ఏదో ఒక ప్రోగ్రామ్ లలో యాంకరింగ్ చేస్తూ బిజీగా గడుపుతూ ఉంటారు. తాజాగా యాంకర్ రవి తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను వెల్లడించాడు. తాను కెరీర్ పరంగా బాగా సక్సెస్ అవుతున్నాడని తెలిసి కొంతమంది ఓర్వలేకపోయారని రవి అన్నారు. తన సక్సెస్ చూసి ఓర్వని ఓ తోటి యాంకర్ తనపై చేతబడి చేయించిందని రవి అన్నారు.

ఏవో క్షుద్ర పూజలు కూడా చేయించిందని చెప్పాడు. అన్ని ఆధారాలతో సహా తనకు తెలుసని స్పష్టం చేశాడు. కానీ అలాంటివి పెద్దగా పట్టించుకోనని వాటి జోలికి కూడా నేను పోను అంటూ రవి వెల్లడించాడు. స్ట్రాంగ్ గా ఉన్నంతకాలం ఎవరూ కూడా తనను ఏమీ చేయలేరని చెప్పాడు. తన కూతురు మంచి కోసం ఏమైనా చేస్తానని రవి వెల్లడించాడు. ప్రస్తుతం రవి షేర్ చేసుకున్న ఈ విషయాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలిసిన రవి అభిమానులు ఆ యాంకర్ ఎవరు అని ప్రశ్నిస్తున్నారు.అలా చేసే వారిని అస్సలు వదలకూడదని అంటున్నారు. ఈ కామెంట్ల పైన రవి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.