దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవం

-

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రోజుకో శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర ప్రార్థనా మందిరాలను అలంకరించడంతోపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేవాలయాల్లో వేదపారాయణం, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.

ప్రముఖ క్షేత్రాల్లో భక్తి, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆధ్యాత్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కొత్తగా 2 వేల 43 ఆల‌యాల‌కు ధూపదీప నైవేద్య ప‌థ‌కం అమ‌లుకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. యాదాద్రిలో మిల్లెట్ ప్రసాద సేవ‌ల‌ను ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించనున్నారు. స్వపరిపాలనలో అస్థిత్వంతో కూడిన ఆధ్యాత్మిక శోభ‌  ప్రభుత్వం తెలిపింది.  ఆధ్యాత్మిక చింతన క‌లిగిన‌ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం సంప్రదాయాలు, ఆలయాలు, పండుగలు, వేడుకలకు అత్యంత ప్రాధాన్యత కల్పించడంతోపాటు ఆధ్మాత్మిక వైభ‌వం ఉట్టిప‌డుతోందని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version