దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 19న హరితోత్సవం: కేసీఆర్‌

-

తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వివరించారు. హైదరాబాద్‌ అభివృద్ధి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 21 రోజుల పాటు వేడుకలు అట్టహాసంగా జరపాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా రోజుకో శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖలో సాధించిన పురోగతిని ప్రజలకు వివరించాలని చెప్పారు. జూన్ 19న రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.

అతిపెద్ద మానవ ప్రయత్నంగా తెలంగాణ హరితహారానికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హరితహారంలో 9 ఏళ్లలో 273 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. హరితహారంతో రాష్ట్రంలో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని చెప్పారు. ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా హైదరాబాద్‌కు రెండుసార్లు గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు.

మరోవైపు తెలంగాణ రైతు రాజ్యమై విలసిల్లుతోందని సాగునీటి రంగంలో స్వర్ణయుగంలా మారిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ పొలాల దాహార్తిని తీర్చేందుకు ఉద్యమకాలంలో నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version