న్యూట్రిషన్‌ కిట్లతో ఒక తరం ఆరోగ్యకరంగా పెరుగుతుంది : కేసీఆర్

-

వైద్యరంగంలో తెలంగాణను అగ్రగ్రామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో వైద్యసిబ్బంది పనిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. హైదరాబాద్‌ నగరంలో నలుదిక్కులా నాలుగు ఆసుపత్రులతో పాటు వరంగల్‌లో హెల్త్‌సిటీ నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో దేశంలోనే అత్యంత పెద్ద ఆసుపత్రిగా నిమ్స్‌ రూపుదిద్దుకునేందుకు కీలక అడుగుపడిందని వెల్లడించారు. దశాబ్ది బ్లాక్ పేరుతో 2వేల పడకలతో కొత్త బ్లాక్ నిర్మాణానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి కేసీఆర్‌ భూమి పూజ చేశారు. కొత్తబ్లాక్ నిర్మాణంతో 38 విభాగాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలోనే కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్లను పంపిణీ చేశారు.

“10 వేల పడకలతో ఆస్పత్రులను నిర్మించుకుంటున్నాం. నిమ్స్‌లో 2 వేల పడకలతో బ్లాక్‌లను నిర్మించుకుంటున్నాం. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా వైద్యారోగ్యశాఖ పనిచేస్తోంది. హెల్త్‌హబ్‌గా హైదరాబాద్‌ తయారు కాబోతోంది. జిల్లాకో మెడికల్‌ కాలేజీ వచ్చింది. రక్తహినతతో బాధ పడుతున్న మహిళలకు న్యూట్రిషన్ కిట్‌ వరం. పుట్టబోయే బిడ్డలు బలంగా ఉంటే రాష్ట్రం బలంగా ఉంటుంది. న్యూట్రిషన్ కిట్‌ గర్భిణీలకు నాలుగో నెలలో ఒకసారి, ఏడో నెలలో ఒకసారి అందిస్తాం. న్యూట్రిషన్‌ కిట్‌ ఇవ్వడం వెనుక చాలా ఆలోచన ఉంది. న్యూట్రిషన్‌ కిట్లతో ఒక తరం ఆరోగ్యకరంగా పెరుగుతుంది.” అని సీఎం కేసీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version