యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన విషయం తెలిసింది. దీనిపై తాజాగా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఇంత దారుణమా? ఇంత అన్యాయమా? చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి చిత్రపటాన్ని కిందగొడతారా?
ఇందుకా తెలంగాణ తెచ్చుకుంది? అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు?.. రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నాడు అంటే అది కేసీఆర్ పెట్టిన భిక్షే అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఫోటో కిందగొట్టే ధైర్యం ఎలా చేశారంటూ కౌశిక్ రెడ్డి అధికార కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. తెలంగాణను దేశంలోనే టాప్-3 రాష్ట్రంగా నిలిపిన ఘనత కేసీఆర్ ది అని హుజూరాబాద్ ఎమ్మెల్యే స్పష్టంచేశారు.