ఈనెల 22న తెలంగాణ అమరుల స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించునున్న సీఎం

-

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌ ఒడ్డున రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘తెలంగాణ అమరుల స్మారక చిహ్నం’  నిర్మించిన విషయం తెలిసిందే. స్మారక చిహ్నం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బుధవారం సమీక్షించారు. ఈ నెల 22న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరిస్తారని మంత్రి వేముల తెలిపారు.

ఇందుకు సంబంధించిన కార్యక్రమం నిర్వహణ, ప్రోగ్రాం రూట్ మ్యాప్, తదితర ఏర్పాట్లపై మంత్రి అధికారులతో సమీక్షించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, సభ, అతిథులకు ఏర్పాట్లు, పార్కింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక కార్యదర్శి విజయేంద్ర బోయి, ఈఎన్‌సీ గణపతిరెడ్డి, సమాచార ప్రజా సంబంధాలశాఖ ప్రత్యేక కమిషనర్‌ కె.అశోక్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version