దశాబ్ది వేడుకల్లో భాగంగా నేడు మహిళా సంక్షేమ దినోత్సవం

-

తెలంగాణ సాధించుకుని విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తై.. పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రోజుకో శాఖ ఆధ్వర్యంలో మంత్రులు.. అధికారులు.. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం రోజున తెలంగాణ రన్ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవంగా రాష్ట్రవ్యాప్తంగా జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ సహా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరగనున్న మహిళా సదస్సులకు అంగన్‌వాడీ టీచర్లు, సెర్ఫ్ సిబ్బందితో పాటు వెయ్యి మందికి తగ్గకుండా పాల్గొనేలా చర్యలు చేపట్టారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మహిళా సంక్షేమ దినోత్సవం వేదికగా ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version