‘తెలంగాణలో నరేంద్ర మోడీ ప్రభుత్వమే రేషన్ బియ్యం పంపిణీ చేస్తోంది’

-

కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలంగాణలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఇవాళ కరీంనగర్ జిల్లాలోని మల్యాలలో వివిధ మోర్చాలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఇస్తున్న రేషన్‌ బియ్యం ప్రధాని మోడీ పంపిణీ చేస్తున్నవేనని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా.. మూడు సంవత్సరాలుగా 80 కోట్ల కుటుంబాలకు కేంద్రం ప్రభుత్వం ఉచిత బియ్యం అందజేస్తోందని ఆయన పేర్కొన్నారు.

వన్ నేషన్– వన్ రేషన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానమని కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. మస్కట్ లో కరోనా వ్యాక్సిన్ కోసం ఒక్కొక్కరు రూ.16 వేలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉచితంగా ప్రధాని మోడీ కరోనా వ్యాక్సిన్ అందించారని గుర్తు చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో వివిధ మోర్చాల నేతలతో జరిగిన సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు.తెలంగాణలో లక్షలాది మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.6 వేల చొప్పున అందిస్తున్నామని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. తెలంగాణలో 11 లక్షల మందికిపైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 30 లక్షల టాయిలెట్లు కట్టించామని, ముద్ర లోన్లు కూడా ఇచ్చామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version