చాణిక్యుడు జీవితం కోసం ఎన్నో విషయాలను, సలహాలను చాణక్య నీతిలో చెప్పాడు. అయితే జీవితంలో అటువంటి సూచనలను పాటించడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. కనుక ఆ సలహాలను తప్పక పాటించడం వలన ఎలాంటి సమస్యలనైనా దూరం చేయవచ్చు. అయితే వివాహానికి సంబంధించి కూడా చాణక్యుడు ఎన్నో విషయాలను చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఎంతో ముఖ్యమైనది. ఎప్పుడైతే వైవాహిక జీవితం బాగుంటుందో భార్య భర్తల మధ్య అనుబంధం మరింత ఉంటుంది. భార్యా భర్తల మధ్య ఎంత వయసు తేడా ఉండాలో చాణిక్యుడు చెప్పడం జరిగింది.
శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా భార్యాభర్తలు ఆరోగ్యంగా ఉంటే వారి అనుబంధం మరింత బాగుంటుంది. ఎప్పుడైతే భార్యాభర్తలు ఇద్దరి మధ్య వయసు లో ఎక్కువ తేడా ఉంటుందో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఎక్కువ కాలం వైవాహిక జీవితం ఆనందంగా ఉండాలి అంటే భార్య భర్తల వయసు మధ్య తక్కువ తేడా మాత్రమే ఉండాలి. చాణక్యుడు ప్రకారం భార్యాభర్తల మధ్య వయస్సు తేడా మూడేళ్ల నుండి ఐదేళ్ల వరకు మాత్రమే ఉండాలి. ఎప్పుడైతే ఇలా ఉంటుందో వారి బంధం ఎంతో దృఢంగా ఉంటుంది మరియు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ ఒకే వయసు గల వ్యక్తులు పెళ్లి చేసుకోకూడదు అని చాణక్యుడు చెప్పడం జరిగింది.
ఎప్పుడైతే ఒకే వయస్సు గల వాళ్ళు పెళ్లి చేసుకుంటారో ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి మరియు నిర్ణయాలను తీసుకోవడంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకే వయస్సు ఉండడం వలన మనస్తత్వాలు కూడా ఒకే విధంగా ఉంటాయి, సరైన తీరులో ఆలోచించరు మరియు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కనుక వయస్సు తేడా అనేది మూడేళ్ల నుండి ఐదేళ్ల వరకు ఉండవచ్చు అని చాణక్యుడు చెప్పడం జరిగింది. ఐదేళ్లకు మించి వయసులో తేడా ఉండడం వలన ఆలోచనలలో ఎన్నో తేడాలను తీసుకువస్తుంది. దాంతో జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ఈ విధంగా భార్యాభర్తల మధ్య వయసు తేడా ఉంటే జీవితంలో ఎంతో ఆనందంగా ఉండవచ్చు.