ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి అంకానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన భారత జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంది. అయితే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ బుధవారం పాకిస్తాన్ లోని లాహోర్ వేదికగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతుంది. అత్యంత కీలకమైన మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ లో భారీ స్కోరు 362/6 చేసింది.
ఈ రెండు జట్లు ఈ సీజన్ లో మంచి ఫామ్ లో కొనసాగుతున్నాయి. దీనికి తోడు రెండు జట్ల లోని కీలక ప్లేయర్లు భీకర ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాటర్లలో యంగ్ 21, రచిన్ రవీంద్ర 108, విలియమ్సన్ 102, మిచెల్ 49, లాథమ్ 4, ఫిలిప్స్ 49, మిచెల్ 16, చేసారు. ఎంగిడి 3, రబాడ 2, ముల్డర్ 1, వికెట్ తీశారు.