మీ వైవాహక జీవితంలో.. ఈ విషయాలని రహస్యంగానే ఉంచాలి.. ఎవ్వరికీ చెప్పొద్దు..!

-

వైవాహిక జీవితంలో ఈ అంశాల గురించి ఎవరికీ చెప్పకూడదు. వీటిని రహస్యంగానే ఉంచాలి. ఆర్థిక పరిస్థితుల గురించి ఎప్పుడూ కూడా బెస్ట్ ఫ్రెండ్ కి కూడా చెప్పుకోకూడదు. ఆర్థిక పరిస్థితి కనుక బాగోకపోతే ఎవరు మీతో ఉండరు అని గుర్తుపెట్టుకోండి. కొన్ని రోజులు తర్వాత ఆర్థిక స్థితి మెరుగుపడొచ్చు. అలాగే మీ ఇద్దరి మధ్య జరిగే గొడవలు గురించి కూడా ఎప్పుడు మూడవ వ్యక్తికి చెప్పొద్దు. ఈ విషయాలను ఎప్పుడూ కూడా రహస్యంగానే భార్యాభర్తలు ఉంచుకోవాలని గుర్తుపెట్టుకోండి. గొడవల గురించి చెప్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. అలాగే బెడ్రూం సీక్రెట్స్ గురించి కూడా ఎవరికి చెప్పొద్దు. సంతోషంగా ఉంటే పర్లేదు లేదంటే ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం వైద్యుని సలహా తెలుసుకోవాలి.

అలాగే అత్త కోడళ్ళ మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. అవి కూడా ఎవరికీ చెప్పుకోకూడదు. వాటిని చెప్పడం వలన మీ కుటుంబం పేరు పోతుంది. మీ భార్య లేదా భర్త ఎవరికీ చెప్పొద్దని మీకు ఏమైనా చెప్తే వాటిని ఇతరులతో పంచుకోవద్దు. రహస్యాన్ని చెప్పద్దు అన్నాక చెప్తే వాళ్ళకి కోపం వస్తుంది. కారణంగా మీ మధ్య గొడవలు వస్తాయి. భర్త లేదా భార్య గురించి చెడుగా చెప్పడం మంచిది కాదు. ఇలా చేయడం వలన కూడా మీరిద్దరూ గొడవలు పడాల్సి వస్తుంది.

మీ పార్ట్నర్ వీక్నెస్ గురించి కూడా ఎవరికి చెప్పకండి దీని వలన ఫ్యామిలీ చులకన అయిపోతుంది. పైగా మీ వీక్నెస్ ని కూడా క్యాష్ చేసుకుంటారు. ఎదుగుదల చూసి ఎప్పుడూ నలుగురు ఏడుస్తూ ఉంటారు అని మీరు అనుకుంటే అలాంటి వాళ్ళతో మీ ఎదుగుదల గురించి చెప్పద్దు. ఏదైనా విషయాన్ని ప్లానింగ్ చేసుకున్నప్పుడు ఎవరికి చెప్పకండి ప్లానింగ్ చేస్తున్నప్పుడు మీరు ఎవరికైనా చెప్పడం వలన వాళ్ళు దానికి అడ్డుపడవచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి విషయాలని ఇతరులతో చెప్పకండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version