మీరు మొదటిసారి డేట్ కి వెళ్తున్నారా? అయితే కచ్చితంగా ఇలా చేయండి. దీనిని మీరు ఫాలో అయ్యారంటే ఎదుటి వాళ్ళు ఇంప్రెస్ అయిపోవడం ఖాయం. డేట్ కి వెళ్లేటప్పుడు ఎవరినైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే ఇలా చేయడం చాలా అవసరం. ఫస్ట్ టైం మీరు బాగా ఇష్టపడే వాళ్ళతో డేట్ కి వెళ్తున్నట్లయితే అది మధురంగా మార్చుకోవాలి. అందుకోసం కొన్నిటిని పక్క ఫాలో అవ్వాలి. మొదటిసారి డేట్ కి వెళ్లేటప్పుడు మీ పార్ట్నర్ కి బాగా నచ్చే ప్రదేశం ఏంటో మీరు తెలుసుకుని.. అక్కడ మీరు డేట్ ని ఫిక్స్ చేస్తే బాగుంటుంది. అలాగే వాళ్లకి నచ్చే విధంగా ఏదైనా గిఫ్ట్ ని తీసుకువెళ్లండి. ఇలా చేయడం వలన వారి మనసును గెలుచుకోవచ్చు. వాళ్ళు ఫిదా అయిపోతారు.
మొదటిసారి డేట్ కి వెళ్లేటప్పుడు ఎదుటి వాళ్ళ ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వండి. దానికి తగ్గట్టుగా మీరు వ్యవహరించారు అంటే కచ్చితంగా మీకు ఎక్కువ మార్కులు పడతాయి. మొదటిసారి మీరు ఎవరితోనైనా డేట్ కి వెళ్తున్నట్లయితే.. ఎవరినీ మీతో పాటు తీసుకెళ్లొద్దు. కేవలం సింగిల్ గానే వెళ్లాలి. అలాగే మీ హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా మీరు సిద్ధమవ్వాలి.
కొంతమంది ఇంప్రెస్ చేయాలనే ఉద్దేశంతో అతిగా పొగడ్తలు కురిపిస్తారు. అలా చేయొద్దు. నార్మల్ గా మాట్లాడాలి. ఎక్కువ పొగడ్తలు మంచి ఇంప్రెషన్ ని క్రియేట్ చేయవు. అలాగే డేట్ పూర్తి అయిన తర్వాత మర్యాదపూర్వకంగా గుడ్ బై చెప్పాలి. వాళ్లతో కాసేపు ఆనందంగా గడిపినందుకు థాంక్స్ చెప్పండి. ఇది మంచి క్వాలిటీ, ఒకవేళ మీరు వీటిని ఫాలో అయినట్లయితే కచ్చితంగా వాళ్ళు ఫిదా అయ్యే అవకాశం ఉంటుంది.