ఇతరులు మిమ్మల్ని గౌరవించడం లేదా..? అయితే తప్పక ఇలా అనుసరించండి…!

సాధారణంగా మనం ప్రవర్తించే తీరును బట్టి, మనం ఉండే ఈ విధానం బట్టి ఇతరులు గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు ఇతరులు మీ పట్ల గౌరవంగా నడుచుకోవాలి అనుకుంటే ఇవి మీలో ఉండేటట్లు చూసుకోండి. దీనితో మిమ్మల్ని గౌరవిస్తారు.

దయ కలిగి ఉండండి:

ఇతరుల పట్ల మీరు దయతో ఉండండి. ఎప్పుడు ఇతరుల్ని హేళన చేయడం లేదంటే ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేయకండి. ఎందుకంటే మీరు ఎలా అయితే రెస్పెక్ట్ కోరుకుంటారో వాళ్లు కూడా మీ నుండి కోరుకుంటారు. కాబట్టి మీరు వీలైనంత పొలైట్ గా వాళ్లతో ఉండండి. ఇది చాలా అవసరం.

గౌరవం ఇవ్వండి:

మీరు మాట్లాడేటప్పుడు లేదంటే మీరు ఏదైనా పని చెప్పినా లేదంటే సరదాగా మాట్లాడుకున్నా ఏ సందర్భం లో అయినా సరే మీరు వాటిని గౌరవించడం చాలా అవసరం. ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా వాళ్ళని గౌరవించడం ఎంతో అవసరం.

బాగా వినండి:

ఎదుటి వాళ్ళు చెప్పేది ముందు వినాలి. ఆ తర్వాత వాళ్లు అడిగితే మీ ఒపీనియన్ చెప్పండి ఇతరులు అడగకుండా మీరు సలహాలు ఇవ్వడం కూడా మంచి పద్ధతి కాదు.

కోపాన్ని తగ్గించుకోండి:

కొన్ని కొన్ని సార్లు కోపం తో ఏం మాట్లాడుతున్నారో తెలియక పోవచ్చు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అవసరం. కోపంతో ఏం మాటలు అంతమో తెలియదు కాబట్టి కోపం తగ్గే వరకు మాట్లాడకండి.

మారడానికి సిద్ధంగా ఉండండి:

ఎవరైనా కరెక్ట్ చెప్తున్నా మొండి పట్టు పట్టి మీరు మారకుండా ఉండకండి. ఎవరైనా ఏమైనా చెప్పిన కూడా మీరు మారడానికి సిద్ధంగా ఉండాలి.