ఇంతకి జనసేన ఎమ్మెల్యే గెలిచారా ఓడారా ?

-

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గానికి రాజకీయంగా ఒక ప్రత్యేక ఉంది. పంచాయితీ ఎన్నికల్లో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే పడింది. ఇటువంటి తరుణంలో ఎన్నికల ఫలితాల్లో జనసేన ఉత్కంఠ లేపింది. ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తాను అధికార వైసిపి వ్యక్తినని చెప్పుకుంటూ జనసేనకు దూరంగా ఉంటున్నారు. ఇక జనసేన నేతలు సరైన నాయకుడు లేకున్నా సవాల్ విసిరి ఏకంగా 11 సర్పంచ్ స్థానాలను గెలుచుకుని ఎమ్మెల్యేకి జలక్ ఇచ్చారు.

రాజోలులో ఎమ్మెల్యే రాపాకకు షాక్‌ తగిలింది. జగన్‌కు జై కొట్టిన వరప్రసాద్‌కు జనసైనికులు ఝలక్ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో కీలక స్థానాలు గెలుచుకొని పట్టు నిలుపుకున్నారు. మరోసారి రాజోలు ప్రజలు జనసేనకు మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో జనసేనను గెలిపించిన స్థానికులు..పంచాయతీ ఎన్నికల్లోనూ 10 స్థానాలు కట్టబెట్టారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతు పలికినా…జనం మాత్రం జనసేనకే జై కొట్టారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న పవన్ అభిమానులు పంచాయతీ పోరులోఊహించని షాక్ ఇచ్చారు.

రాజోలు నియోజకవర్గంలోని 60పంచాయితీల్లో పోటీకి దిగారు. అధికార పార్టీ ధనం బలాన్ని తట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు చందాలు వేసుకుని అభ్యర్థులను బరిలో దింపారు. కొన్ని చోట్ల టిడిపి మద్దతు తీసుకున్నారు. మరికొన్ని చోట్ల టిడిపికి మద్దతు ఇచ్చారు. మొత్తం మీద వైసిపి మద్దతుదారులకు గట్టి పోటీ ఇచ్చారు. మొదట్లో ఏమి పోటి ఉంటుందిలే అని తేలికగా తీసుకున్న ఎమ్మెల్యే రాపాకకు చివరకు చెమటలు పట్టేలా చేశారు. గౌరవ ప్రధంగా 11 సర్పంచ్ లు గెలిచారు. టిడిపి మద్దతు దారులకు 12 చోట్ల గెలుపుకు సహకరించారు. 37 సర్పంచ్ స్థానాల్లో జనసేన మద్దతుదారులు రెండోవ స్థానంలో నిలబడ్డారు. ఓట్ల లెక్కింపులో జనసేన మద్దతుదారులకు లభించిన ఆదరణకు మ్మెల్యేతోపాటు వైసిపి మద్దతు దారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సొంత గ్రామం చింతలమోరిలో మద్దతుదారుడిని పెట్టుకుని గెలిపించుకోవడానికి ఇబ్బంది పడ్డారు. రాజోలు వైసిపి ఇన్ ఛార్జ్ అమ్మాజీ తో ఉన్న విభేదాలు కారణంగా ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నియోజకవర్గంలోని 60 పంచాయతీల్లో మద్దతుదారులను నిలపలేకపోయారు. చివరకు తన సొంత గ్రామం చింతలమోరిలో అమ్మాజీ వైసిపి తరుపున మరో అభ్యర్థిని నిలబెట్టారు. ఇటువంటి సమయంలో వైసిపి రెబల్ గా తన అభ్యర్థిని పెట్టి గెలిపించుకున్నారు.

ఇదే పరిస్థితి పలు పంచాయతీల్లో నెలకొని వైసిపి మద్దతుదారులు ఓటమి చెందారు. జనసేన ముందు నుంచి చెప్పుతున్నట్లుగా సంఖ్య పరంగా గెలవకపోయినా ఓట్లను రాబట్టడం ద్వారా విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news