చాలా మందికి ఎన్నో తెలివితేటలు ఉన్నా సరే గుర్తింపును పొందలేరు. కొంతమంది ఎంతో కష్టపడుతూ ఉంటారు మరియు జీవితంలో విజయాన్ని పొందాలనుకుంటారు. కాకపోతే 100 మందిలో ఉండేసరికి గుర్తింపును అస్సలు పొందలేరు. దానికి కొన్ని రకాల లక్షణాలు ఎంతో అవసరం. ఎప్పుడైతే ఇటువంటి లక్షణాలు ఉంటాయో అందరినీ ఆకట్టుకుంటారు అని సైకాలజిస్ట్ లు చెబుతున్నారు. ఎప్పుడైనా ఇతరులు మిమ్మల్ని ఇష్టపడాలి అనుకుంటే, వారి పేర్లను గుర్తించుకోవాలి మరియు మాట్లాడేటప్పుడు పేరుతో పిలిచి సంబోధించాలి. ఇలా చేయడం వలన వారిలో మీపై ముద్ర పడుతుంది. అంతేకాకుండా, మానసికంగా మీతో కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
అదే విధంగా మిమ్మల్ని ఇష్టపడాలి అనుకుంటే మీరు మాట్లాడటం కంటే వినడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా చేయడం వలన సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. దీంతో మీ వైపు ఆకర్షితులవుతారు మరియు మరింత ప్రత్యేకంగా చూస్తారు. ఏదైనా తప్పు జరిగే అవకాశాలు ఉన్నట్లయితే, ముందుగా మీరే క్షమాపణ చెప్పాలి. ఇలా చేయడం వలన గొడవలు తగ్గుతాయి. అంతేకాకుండా మీపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. సహజంగా ఎప్పుడైతే సరదాగా మాట్లాడుతుంటారో ఇతరులు ఇష్టపడతారు. కనుక ఇతరులతో పరిచయం పెంచుకోవాలంటే ఎంతో సరదాగా మాట్లాడాలి.
అంతేకాకుండా నవ్వుతూ మాట్లాడడం వలన ఇతరుల మనసు తేలికపడుతుంది. దీంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. కనుక ఇటువంటి లక్షణాలను అలవాటు చేసుకోవడం వలన అందరిని త్వరగా ఆకట్టుకుంటారు. ముఖ్యంగా కొత్త పాత అనే తేడా లేకుండా చాలామంది తో ఎంతో ఆకర్షణీయంగా మాట్లాడవచ్చు. పైగా అందరి చూపూ మీపై ఉంటుంది. ఈ విధంగా ఎంతో మంచి గుర్తింపు వస్తుంది. కనుక ఎంతో కష్టపడి గుర్తింపు పొందలేని సందర్భాలు ఎదురైతే, ఇటువంటి లక్షణాలను కచ్చితంగా అలవాటు చేసుకోండి. దీంతో మీపై గౌరవం మరియు ఇష్టం పెరుగుతుంది. దీంతో మంచి గుర్తింపు పొంది ఎంతో త్వరగా విజయాన్ని సాధిస్తారు.