సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లు సాధించి కడపను స్వీప్ చేస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మహానాడు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చంద్రబాబు. జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు చంద్రబాబు.

ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… రాయలసీమ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలిపేందుకు కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. గతంలో మహానాడు అంటే వేడి వాతావరణం ఉండేదని.. కానీ ఇప్పుడు చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణంలో మహానాడు జరుపుకుంటున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.