ప్రతి ఒక్కరూ లైఫ్ లో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. మీరు కూడా లైఫ్ లో సంతోషంగా ఉండాలనుకుంటే.. వీటిని మాత్రం వదిలేయండి. ప్రతి ఒక్కరిలో మంచి అలవాట్లు, చెడు అలవాట్లు అనేవి ఉంటాయి. చెడు అలవాట్లని దూరం పెడితే లైఫ్ అంతా కూడా బాగుంటుంది. అలాంటి అలవాట్ల గురించి ఇప్పుడు చూద్దాం. లైఫ్ బాగుండాలి అంటే కొన్నిటిని ఫాలో అవ్వాలి. కొన్నిటికి దూరంగా ఉండాలి. మనకి తెలిసి, తెలియక కొన్ని అలవాట్లు మనల్ని ఎంతో బాధపడతాయి. వాటి కారణంగా మనకి తెలియకుండానే ఎక్కువగా మనమే ఎఫెక్ట్ అవుతుంటాం.
- స్వార్ధాన్ని విడిచి పెట్టాలి. స్వార్థం కారణంగా సమస్యలు వస్తాయి. అన్ని సార్లు స్వార్థం మంచిది కాదు. అందుకే స్వార్ధాన్ని విడిచి పెట్టాలి అప్పుడే సంతోషంగా ఉండొచ్చు.
- ఎదుటి వాళ్ళు చేసే తప్పుల్ని చెప్పడం వలన మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. కాబట్టి ఈ అలవాటు ఉన్నట్లయితే మానుకోవడం మంచిది. లేదంటే అనవసరంగా మీరే కృంగిపోవాల్సి వస్తుంది.
- చాలామంది ఒకరు బాధపడితే సంతోషంగా ఫీల్ అవుతారు. ఇది కూడా చాలా తప్పు. ఎదుటి వాళ్ళు ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే మనం సంతోషాన్ని వెతుక్కోకూడదు. ఆ సమస్యలే మళ్ళీ మనకి ఎదురవ్వచ్చు అని గుర్తుపెట్టుకోవాలి.
- కోపంగా ఉండడం చాలా ఇబ్బందుల్ని కలిగిస్తుంది. కోపం మంచిది కాదు. కోపం కారణంగా ఇతరుల బాధపడడమే కాకుండా మనం కూడా బాధపడాల్సి వస్తుంది. కోపం లో చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు కూడా.
- ఎప్పుడూ కూడా ఎవరి లైఫ్ వాళ్ళది. ఒకరితో పోల్చుకోవడం మంచిది కాదు. ఎవర్ లైఫ్ వాళ్ళకి ప్రత్యేకంగా కాబట్టి ఎప్పుడూ కూడా ఒకరితో కంపేర్ చేసుకోవద్దు. దీనివలన మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఏదో తక్కువైపోయింది అనే బాధ కలుగుతుంది. మనకి ఉన్న దానితో మనకి సంతృప్తి చెందడానికి అవ్వదు. కాబట్టి ఈ పొరపాటు కూడా చెయ్యొద్దు.