గాంధీతో నా స్నేహం సాయంత్రం వచ్చే ఎండలా ఉండేది.. నెహ్రూ

-

కవి భర్తృహరి ఓ మాటన్నారు.. ఏమని అంటే.. సజ్జనులతో స్నేహం సాయంత్రం వచ్చే ఎండలా ఉంటుందట. అంటే.. ఆలస్యంగా మొదలైనా ఆ స్నేహం స్థిరంగా ఉంటుందని అర్థం. గాంధీతో నా స్నేహమూ అలాంటిదే అని జవహర్ లాల్ నెహ్రూ అన్నారు.

“జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్న సమయంలో నేను నాన్న మోతీలాల్ తో వెళ్లాను. నాయకుడు ఎలా ఉండాలి అని అప్పుడు నన్ను అడిగితే నేను నాన్ననే చూపించేవాడిని. నా దృష్టిలో నాయకుడంటే నాన్నే కనిపించేవారు. ఆయన మంచి వక్త. చాలా గంభీరంగా మాట్లాడేవారు నాన్న. సమావేశానికి వెళ్లిన సమయంలోనే గాంధీజీని నాన్న నాకు పరిచయం చేశారు. అప్పుడే మొదటి సారి కావడంతో నేను ఆయనతో ఎక్కువగా ఏం మాట్లాడలేకపోయాను. ఏదో అలా మాట్లాడేశాను. అప్పుడు నా వయసు 27 ఏళ్లు. గాంధీ వయసు 47 ఏళ్లు. అప్పుడు అందరూ గాంధీని ఆయన దక్షిణాఫ్రికాలో చేసిన పోరాటానికి మెచ్చుకున్నారు. ఆయనతో ఎక్కువగా ఏం మాట్లాడనప్పటికీ.. ఆయనలో ఏదో ఉందని గ్రహించాను. ఏదో ప్రత్యేకత ఉందని నాలో నేనే అనుకున్నా. కానీ.. ఆయనలో ఉన్న ప్రత్యేకత గురించి తెలుసుకోవడానికి మాత్రం చాలా సమయం పట్టింది. భారత స్వాతంత్ర్య పోరాటం కోసం అందరం నడుం బిగిస్తున్న రోజులు అవి. కాకపోతే స్వాతంత్ర్యం రావాలంటే పోరాడాల్సిందే అని నేననుకునేవాడిని. కానీ.. ఎలా పోరాడాలి? ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై నాకు స్పష్టత లేదు. దానికి సమాధానంగా గాంధీ బోధించిన సత్యాగ్రహ మార్గం నన్ను ఆలోచింపజేసింది. సత్యాగ్రహ మార్గంలో గాంధీజీ వెంటే నేనూ నడిచాను. అలా.. అలా.. మా ఇద్దరి మధ్య బంధం మొదలైంది. ఆ తర్వాత గాంధీ నాకు చాలా దగ్గరి మనిషి అయ్యారు. ఆయన్ను అప్పటికి గానీ అర్థం చేసుకోలేకపోయాను. ఆయన మహాత్ముడు..” అని అంటారు నెహ్రూ.

Read more RELATED
Recommended to you

Exit mobile version