భయమే ఓటమికి కారణం అవుతుంది. పైగా ఎక్కువ భయ పడటం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. శక్తి, సామర్ధ్యాలు ఉన్నా తెలివితేటలు వున్నా భయం ఉంటే గెలవడం చాలా కష్టం.
అయితే భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి…? అనేది ఇప్పుడు చూద్దాం. దీని వల్ల మీరు గెలవడానికి కూడా వీలవుతుంది. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు.
భయంతో పోరాడడం:
ఎప్పుడైనా మీరు ధైర్యంగా ఉండాలి అంటే మీరు భయం తో పోరాడాలి. దేనికైతే మీరు భయపడుతున్నారో దానితో పోరాడడానికి ప్రయత్నం చేయాలి. దీంతో నెమ్మదిగా మీ భయం దూరమవుతుంది.
సరదాగా బయటకు వెళ్లడం:
ఒకే దగ్గర ఒంటరిగా కూర్చోవడం కంటే ప్రశాంతంగా ఉండేట్టు చూసుకోండి. పైగా మీరు దేని కోసం అయితే భయపడుతున్నారో దానికి సంబంధం లేని పనులు చేయండి. దీనితో మీరు రిలాక్స్ గా ఉండవచ్చు.
ఆలోచించడం:
మీరు గట్టిగా ఒకసారి ఆలోచించండి. ఈ భయాన్ని జయించకపోతే మీరు జీవితం లో ఏమేమి కోల్పోవాల్సి వస్తుందో అనే వాటి కోసం తలచుకోండి. ఇలా చేయడం వల్ల మీరు నెమ్మదిగా భయం నుంచి బయట పడవచ్చు.
మీ భయం గురించి మీ స్నేహితులతో చెప్పండి :
స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మీ భయాన్ని పంచుకోండి. దీనితో వాళ్ళు చెప్పే మాటలు మీకు కాస్త ధైర్యాన్ని ఇస్తాయి. పైగా మీరు కాన్ఫిడెంట్ గా ఉండడానికి ఇవి సహాయపడతాయి.
కనుక మీరు భయాన్ని మీ జీవితం లో ఉంచి నెమ్మదిగా తీసేస్తూ విజేతగా నిలవండి. ఒకవేళ మీరు మీ భయాన్ని కనుక దూరం చేయకపోతే మీరు గెలవడం అసంభవం. కాబట్టి ఈ పద్ధతిని అనుసరించి భయాన్ని తరిమికొట్టండి.