ఈ సమాజంలో అందరితో మంచిగా ఉండటం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవే

-

మంచితనం.. ఇది అందరిలో ఉంటే బాగుంటుందని మనలో ఉంటే మనల్ని అందరూ మెచ్చుకుంటారని ఒకప్పుడు చెప్పేవారు. ఇప్పుడు అలా చెప్పడం లేదు. ఎందుకంటే అందరితో మంచిగా ఉండటం వల్ల నష్టాలు ఎదురవుతున్నాయి కాబట్టి.

ఎస్.. అందరితో మంచిగా ఉండడం సాధ్యం కాదు. అలా ఉండాలని అనుకోవడం కూడా తప్పే. ఈ లోకంలో ఎన్నో రకాల మనుషులు ఉన్నారు. వాళ్లందరితో ఒకేలా ఉండటం అస్సలు కుదరదు. నీవు మంచిగా ఉన్నావంటే నీ మీద ఎక్కి డాన్స్ చేసేస్తారు. అందుకే ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉండాలి.

ఉదాహరణకు. ఒకడు నిన్ను ఈరోజు పని ఉందని పిలిచాడు అనుకుందాం. నిజానికి నీక్కూడా ఈ రోజు పని ఉంది. బట్ వాడు పిలిచాడన్న కారణంతో నీ పని మానుకుని మరీ వారి కోసం వెళ్లావు. ఇలా రెండు మూడుసార్లు నువ్వు చేసావంటే అవతలి వాడి దృష్టిలో నువ్వు చీప్ అయిపోతావు.

నీ మంచితనంతో ప్రతిసారి అందుబాటులో ఉంటున్నావ్ కాబట్టి నిన్ను లెక్కచేయరు. కిలో టమాటాలు రెండు రూపాయలకే వస్తే వాటిని ఎలా లెక్క చేయరో.. నిన్ను కూడా అలా లెక్క చేయరు.

అందుకే అతి మంచితనంతో అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, అందరికీ మంచి చేయాలని అనుకోవడం అస్సలు మంచిది కాదు. ప్రస్తుత సమాజంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. నువ్వు మంచి చేశావు కాబట్టి అవతల వాళ్ళు నీకు మంచి చేయాలన్న రూల్ లేదు. అలా చేయడం లేదు కూడా.

ఇక్కడ కేవలం అవసరాలను బట్టి మనుషులు మారుతున్నారు. అవసరం వస్తే ఒకలా, అవసరం తీరినాక మరోలా ఉంటున్నారు. ఇదంతా గ్రహించి జాగ్రత్తగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version