గుడిమల్కాపూర్‌లో గాలిలో ఫైరింగ్

-

హైదరాబాద్ నగరంలో గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్ పోలో కాల్పులు కలకం రేపాయి. ఎక్స్ పోలో స్టాల్స్ పెట్టుకున్న ఇద్దరు దుకాణదారుల మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ గొడవ కాస్త తీవ్రస్థాయికి చేరుకుని ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో ఇద్దరిలో ఓ దుకాణదారులు తన వద్ద ఉన్న తుపాకి తీసి కాల్పులు జరిపాడు. దీంతో ఎక్స్ పోకు వచ్చిన వారంతా భయంతో పరుగులు తీశారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గాలిలోకి కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అతడిని విచారిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఎక్స్ పో నిర్వాహకులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఎక్స్పో ప్రాంతంలో భద్రతను పెంచినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఇక్కడ కాల్పులు కలకలం రేపడంతో ఎక్స్ పో కు రావాలంటే జనం జంకుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version