టాలీవుడ్ నటుడు నవదీప్ గురించి తెలియనివారుండరు. సినిమాలతో అలరించే నవదీప్.. సోషల్ మీడియాలో డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాడు. నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులతో తరచూ ఇంటరాక్ట్ అవుతుంటాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తాజాగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు. తాజాగా తాను ఓ కొత్త ట్రావెల్ కంపెనీ ఏర్పాటు చేశాడు.
‘ఎన్ఎస్ 4 ట్రిప్స్’ అనే కంపెనీ స్టార్ట్ చేసిన నవదీప్ కు టాలీవుడ్ హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, సీరత్ కపూర్, నటి మంచు లక్ష్మి సపోర్టుగా నిలిచారు. నవదీప్ కంపెనీకి వారు ప్రమోషన్స్ చేస్తూ కనిపించారు. అయితే ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టపడే నవదీప్ అందులోనే నాలుగు కాసులు సంపాదించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఈ ట్రావెలింగ్ కంపెనీని ప్రారంభించాడు. అయితే తొలి ట్రిప్ లో ఆయన.. ప్రగ్యా, మంచు లక్ష్మి, సీరత్ కపూర్ లను తీసుకెళ్లాడు. ఈ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేశాడు.