పెళ్లి అయిన తర్వాత జీవితం ఒకే విధంగా ఉండదు. ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే దాంపత్య జీవితం బాగుండడం కోసం చాణక్య ఎన్నో విషయాల గురించి చెప్పడం జరిగింది. చాణక్య చెప్పినట్లు పాటించడం వలన వైవాహిక జీవితంలో ఎంతో మంచి మార్పుని పొందవచ్చు. అందరూ సంతోషంగా ఉండాలని భావిస్తారు, కాకపోతే సంతోషంగా ఉండాలంటే ఈ సూత్రాలని ఆచరించడం ఎంతో అవసరం. చాలా శాతం మంది పెళ్లి అయిన తర్వాత ఎంతో హాయిగా ఉండాలని మంచి జీవితాన్ని గడపాలని భావిస్తారు. కాకపోతే పెళ్లి అయిన తర్వాత ఎన్నో కారణాల వలన సంతోషంగా అస్సలు ఉండలేరు.
వైవాహిక జీవితం బాగుండాలి అంటే తప్పకుండా నిజమైన ప్రేమ అవసరం. దీనితో పాటుగా వైవాహిక జీవితం బాగుండాలి అంటే ప్రతి ఒక్కరి బంధంలో నిజాయితీ ఎంతో అవసరం. నిజమైన ప్రేమ ఉండడం వలన సంతోషాన్ని పొందవచ్చు. అంతేకాక ప్రతి ఒక్క విషయాన్ని భార్యా భర్తలు పంచుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఎలాంటి రహస్యాలు లేకుండా ఒకరితో ఒకరు ప్రతి విషయాన్ని పంచుకుంటూ ఉంటారో అప్పుడే నమ్మకం పెరుగుతుంది. దీంతో బంధం మరింత దృఢంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సమస్యలు రావడానికి కారణం అహంకారం.
భార్యాభర్తల మధ్య అహంకారం ఉండడం వలన బంధం తెగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఒకరితో ఒకరు ఎంతో మర్యాదగా వ్యవహరించాలి. ఎప్పుడైతే గౌరవం ఉంటుందో అప్పుడే ఆ బంధం ఎంతో బాగుంటుంది. ఏ బంధంలో అయినా ఇద్దరు వ్యక్తులు మాత్రమే వ్యవహరించాలి, మూడవ వ్యక్తి చెప్పే వాటిని వింటూ ఉండడం వలన ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా బంధం లో మూడవ వ్యక్తికి అస్సలు చోటు ఇవ్వకూడదు. ఇలా చేయడం వలన మీ బంధం ఎంతో ధృడంగా ఉంటుంది మరియు ఎలాంటి సమస్యలు వచ్చినా తిరిగి సంతోషంగా జీవిస్తారు.