మీరు ఇతరులతో మర్యాదగా ఉండాలి అనుకుంటున్నారా..? అయితే ఇది మీకోసం…!

-

చాలా మంది ఇతరులతో చాలా క్లోజ్ గా ఉండాలి అనుకుంటారు. ఎవరితోనైనా మర్యాదగా ఉండాలన్నా.. మంచి ఒపీనియన్ పొందాలన్నా ఇవి మీలో ఉండాలి.

అందరికీ హలో చెప్పడం :

అందర్నీ నవ్వుతూ పలకరించడం, నాచురల్ గా నవ్వడం, అవసరమైనప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం. ముఖ్యంగా తోటి ఉద్యోగస్తులను పలకరించడం చేయాలి.

మాట్లాడడానికి సమయం వెచ్చించండి:

వాళ్ల మీద ఆసక్తి చూపిస్తూ వాళ్ళతో కాసేపు మాట్లాడండి. కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో మంచి మాటలు మాట్లాడడం, మంచి విషయాలను పంచుకోవడం చేయండి.

క్షమించండి. ధన్యవాదములు వంటివి ఉపయోగించండి:

ఎప్పుడైనా మీకు ఏదైనా సంభాషణ వచ్చినప్పుడు ఎక్కువగా క్షమించండి మరియు ధన్యవాదములు వంటి పదాలను ఉపయోగించండి. చాల మంది వీటిని ఉపయోగించారు. అది మంచి పద్దతి కాదు.

అభినందించడం:

ఏదైనా సందర్భాల్లో అభినందించాల్సి వస్తే వాళ్ళని హృదయపూర్వకంగా అభినందించండి. ఇది కూడా చాలా ముఖ్యం.

సరైన భాషనే మాట్లాడండి:

అనవసరమైన మాటలు అనర్థాలకు దారి తీస్తాయి కాబట్టి అవసరమైన విషయాలనే మాట్లాడండి, మంచిగా మాట్లాడండి.

ఇతరుల సమయాన్ని గౌరవించండి:

ఎక్కువగా ఇతరులతో మాట్లాడడం, అనవసరంగా వాళ్ల దగ్గరికి వెళ్లడం చేయకండి. వాళ్ళ సమయానికి కూడా మీరు గౌరవం ఇవ్వడం ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news