జగన్ చెప్పిందే చెబుతున్న మరో సీఎం…ఇప్పుడేమంటారో?

-

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనాతో సహజీవనం చేయడం తప్పని పరిస్థితి అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన వెంటనే… అదేదో బూతు పధంలా భావించిన ప్రతిపక్షాలు అంతెత్తున్న లేచాయి. అది వారి అవగాహనరా రాహిత్యమే లేక రాజకీయ అవకాశవాదమో తెలియదు కానీ… ఇదే మాట నొక్కి చెబుతున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్!

దేశంలో క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ ఒక‌టి. అందుకు ప్ర‌ధాన కార‌ణం త‌బ్లిగీనే అనేది అంతా చెప్పే మాటే. దేశంలో న‌ల‌భై వేల‌కు పైగా కేసులు నమోదు అయితే వాటిల్లో ప‌దోవంతు.. అంటే సుమారు నాలుగు వేల‌కు పైగా కేసులు ఒక్క ఢిల్లీలోనే ఉన్నాయి. వీరిలో దాదాపు 64 మంది కరోనా భారినపడి మ‌ర‌ణించారు. ఇదే క్రమంలో రోజు రోజుకీ కొత్త కేసుల న‌మోదు కూడా గ‌ణ‌నీయంగా ఉందనే చెప్పుకోవాలి. ఈ క్ర‌మంలో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఒక ప్ర‌క‌ట‌న చేశారు. అదేమిటంటే.. ఢిల్లీ రీ ఓపెన్ కు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని!

మే 3 త‌ర్వాత కూడా కేంద్రాన్ని లాక్ డౌన్ కోరిన రాష్ట్రాల్లో ఢిల్లీ ఉన్న సంగతి తెలిసిందే… అయితే ఇప్పుడు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్.. ఢిల్లీని రీ ఓపెన్ చేయాల‌ని అంటున్నారు. అంతేకాదు.. క‌రోనాతో క‌లిసి జీవించాల్సి ఉంటుంద‌ని కూడా ఢిల్లీ సీఎం వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంద‌రి క‌న్నా ముందుగా ఈ వ్యాఖ్య చేసిన సంగతి తెలిసిందే. క‌రోనాతో క‌లిసి జీవించాల్సి ఉంటుందని జ‌గ‌న్ అంటే, ఏపీ ప్ర‌తిప‌క్ష‌ నేత‌లు అంతెత్తున లేచారు. క‌ట్ చేస్తే.. మాజీ ఐఆర్ఎస్ అధికారి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ సీఎం కూడా అదే మాటే చెప్పారు. క‌రోనాతో క‌లిసి జీవించాల్సి ఉంటుంద‌ని!!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version