ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్ వైఖరి ఏంటీ అనేది ముందు నుంచి ప్రపంచానికి తెలిసిందే. ఉగ్రవాదులను పెంచి పోషించి వాళ్లకు పెళ్లి చేసి వాళ్ళ పిల్లలను పెంచి మళ్ళీ ఉగ్రవాదులను చేసి ప్రపంచం మీదకు వదులుతుంది. ప్రపంచానికి చుక్కలు చూపించే ఉగ్రవాద మూకలు అన్నీ కూడా పాకిస్తాన్ సర్కార్ తయారు చేసినవే. వాళ్ళను అన్ని విధాలుగా పెంచి పోషించి ఆర్ధిక సహాయం కూడా చేసింది.
ఉగ్రవాదులను అరెస్ట్ చేయమని అమెరికా లేదా అంతర్జాతీయ సమాజం చెప్తే వాళ్ళను గృహ నిర్భందంలో ఉంచుతుంది. లష్కరే తాయిబా చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌ను ఈ ఏడాది మొదట్లో అరెస్ట్ చేసింది. భారత్ అంతర్జాతీయంగా తెచ్చిన ఒత్తిడితో పాక్ ప్రభుత్వం అతడిని గృహనిర్బంధంలో ఉంచింది. పాక్ కోర్టు అతడికి 11ఏళ్ల జైలు శిక్షను కూడా విధించింది. అమెరికా ఒత్తిడితో భద్రతా మండలి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు.
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) జాబితాలో ఉన్న హఫీజ్ సయీద్‌కు పంజాబ్ జైలులో 50 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది అని విడుదల చేసింది. అతని ప్రాణాలకు ముప్పు ఉందని అందుకే విడుదల చేసామని పాకిస్తాన్ చెప్పడం గమనార్హం. భారత్ లో ఉగ్రదాడులకు అతను కీలక సూత్రధారి… ముంబై పేలుళ్ళలో కూడా అతని పాత్ర ఉంది అని విచారణలో వెల్లడైంది.