మెగాస్టార్ చిరంజీవి సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆచార్య. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40 శాతం మాత్రమే పూర్తి చేశారు. చాలా కారణాల వల్ల షూటింట్ జరగలేదు. అన్నీ సవ్యంగా జరిగుంటే ఆచార్య విజయదశమి బరిలో ఉండేది.. మహేష్ బాబు నటిస్తున్న కారణంగా కొంత డిలే అయింది. కాని మళ్ళీ ఆయన డ్రాప్ అయి రాం చరణ్ వస్తాడన్న డైలమా ఒకటి. ఈ నేపథ్యంలో కొంత సినిమా మరింత ఆలస్యం అయింది.
ఇక ముందు అనుకున్న కథ కంటే ఆ తర్వాత చిరంజీవి సూచన మేరకు మరికొన్ని చేయడం కోసం కొరటాల కొంత సమయం తీసుకోవడం వల్ల షూటింగ్ అనుకున్న సమయానికి మొదలవలేదు. షూటింగ్ ప్రారంభం అయినా నెమ్మదిగానే సాగింది. ఇక హీరోయిన్స్ సమస్య ఒకటి కూడా కారణం. ఇప్పుడు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ చిరంజీవి సరసన ఫైనల్ అయింది. లాక్ డౌన్ తర్వాత కాజల్ మీద ముందు కాంబినేషన్ సీన్స్ ని కంప్లీట్ చేస్తారట.
అయితే ఈ సినిమా ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కరోనా నుంచి. దాదాపు మూడు నెలలు ఈ సినిమా షూటింగ్ జరగకుండా నిలిచిపోయిందనే చెప్పాలి. పరిస్థితులు చక్కబడితే జూలై నుంచి మళ్ళీ ఆచార్య సినిమా షూటింగ్ యథాతదంగా మొదలయ్యో అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేద్దామని కొరటాల బృందం అనుకుంటున్నారట. అంతవరకు బాగానే ఉంది.
కాని మిగతా సినిమాలు సంక్రాతి రేస్ లో ఉండకపోతే బెటర్ అన్న ఆలోచనే సరైనది కాదు అని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ చేయాలనుకున్న సినిమాలన్ని నెమ్మదిగా సెప్టెంబర్ నుంచి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ జనాలు థియోటర్స్ కి రారేమో అన్న భావన ఉంటే మాత్రం సంక్రాంతినే నమ్ముకుంటున్నారు. ఇలా ఎవరి సౌలభ్యం ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుంటుంటే మేమొక్కరమే వస్తాము అంటే ఎలా అని మిగతా మేకర్స్ ఫీలవుతున్నారట.