చైనా వూహన్ నగరంలో పుట్టిక కరోనా వైరస్ గత రెండేళ్ల నుంచి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. రూపాలు మార్చకుంటూ.. ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే ఆల్పా, బీటా, డెల్టా, ఓమిక్రాన్, బీ.ఏ. 2 వేరియంట్ల రూపంలో ప్రజలను ఇబ్బందిపెడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ లోని కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే కరోనా వేరియంట్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా వేరియంట్లలో ఓమిక్రాన్ చివరిదని చెప్పలేమని.. మున్ముందు ఇలాంటి కొత్త వేరియంట్లు వస్తూనే ఉంటాయని WHO కోవిడ్ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కేర్ఖోవ్ వెల్లడించారు. కరోనా వైరస్ గురించి మాకు తెలుసు అని.. అయితే దాని గురించి అన్ని తెలియాలని లేదని అన్నారు. ఈ వైరస్ నుంచి పుట్టుకొచ్చే వేరియంట్లకు ముగింపు లేదని విషయాన్ని ప్రజలు ద్రుష్టితో పెట్టుకోవాలని సూచించారు.