భారత్​లో మరో కరోనా​ వేరియంట్ కలకలం.. కేంద్రం అలెర్ట్

-

అమెరికా, ఇంగ్లాండ్‌లో ఒక్కసారిగా భారీ సంఖ్యలో కొవిడ్ కేసులు పెరగడానికి కారణమైన కొత్త వేరియంట్ ఎక్స్​బీబీ 1.5 ఇండియాలోనూ వెలుగు చూసింది. భారత్​లో ఈ వేరియంట్​కు సంబంధించి ఇప్పటివరకు 5 కేసులు బయటపడ్డాయని జన్యుక్రమాన్ని విశ్లేషించే సంస్థల కన్ఫార్షియం(ఇన్ఫాకాగ్‌) తెలిపింది. గుజరాత్​లో మూడు, కర్ణాటక, రాజస్థాన్​లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.

ఒమిక్రాన్‌కు చెందిన సబ్​వేరియంట్ ఎక్స్​బీబీ 1.5 అమెరికాలో 40.5 శాతం కేసులు పెరగడానికి కారణమైంది. ఇంగ్లాండ్‌, న్యూయార్క్‌లో ఏకంగా 75 శాతం కేసులు పెరగడానికి ఈ వైరస్‌ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బీఏ.2 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ నుంచి ఎక్స్​బీబీ పుట్టుకొచ్చినట్లు వివరిస్తున్నారు. తాజాగా ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ఎక్స్​బీబీ సబ్‌ వేరియంట్‌ కారణమని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఎక్స్​బీబీ 1.5 ఉపరకం కారణంగా పలు దేశాల్లో కేసులు పెరిగినప్పటికీ భారత్‌పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వైద్యనిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version