టీఎస్​ఆర్టీసీలో స్లీపర్‌ బస్సులు.. ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి

-

తెలంగాణలో తొలిసారిగా ఆర్టీసీ.. నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తోంది. మొదటగా 4 స్లీపర్‌, మరో 6 స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులను ఇవాళ ప్రారంభించనుంది. హైదరాబాద్‌ కేపీహెచ్​బీ కాలనీ బస్టాప్ వద్ద సాయంత్రం 4 గంటలకు సంస్థ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ సజ్జనార్‌ ఈ బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు.

హైదరాబాద్‌-కాకినాడ, హైదరాబాద్‌-విజయవాడ మార్గాల్లో అద్దె ప్రతిపాదికన ఈ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం నడపనుంది. స్లీపర్‌ బస్సుల్లో లోయర్‌ బెర్తులు 15, అప్పర్‌ బెర్తులు 15 వరకు ఉంటాయి. ప్రతి బెర్త్‌ వద్ద వాటర్‌ బాటిల్‌ పెట్టుకునే సదుపాయంతోపాటు మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యం ఉంటుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి బస్సులోనూ వైఫై సదుపాయం కల్పించారు. ఈ బస్సుల్లో ప్రయాణించేవారికి ఒక వాటర్‌ బాటిల్‌తో పాటు ఫ్రెష్‌నర్‌ను ఉచితంగా అందజేస్తారు. లగేజీ లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు అటెండెంట్లు సహకరిస్తారని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version