ఇండియాలో కరోనా వ్యాక్సిన్ పై చేస్తున్న ప్రయోగాలు ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ వ్యాక్సిన్ కోసం బాగా కృషి చేస్తుంది. ప్రస్తుతం రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకున్న కంపెనీ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ని ప్రారంభించనుందని సోమవారం ప్రకటించింది. ఈ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ 26వేల మంది వాలంటీర్లపై చేయనున్నారట.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భాగస్వామ్యంతో మొదలవుతున్న ఈ ట్రయల్స్ కి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి ఆమోదం కూడా లభించింది. మొత్తం 26వేల మంది వాలంటీర్లని భారతదేశంలోని 22పట్టణాల నుండి ఎంచుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో వాలంటీర్లపై ట్రయల్స్ చేయడంలో భారత్ బయోటెక్ మొదటిదని పేర్కొన్నారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఆ వాలంటీర్లందరూ 18సంవత్సరాలు పైబడినవారే అని చెప్పుకొచ్చారు.