ఛత్తీస్ గఢ్ లో జర్నలిస్టు ముఖేశ్ ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టర్ ను బీజాపూర్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఇదిలాఉండగా, జర్నలిస్టు ముఖేశ్ హత్యకు సంబంధించిన పోస్టు మార్టం రిపోర్టు వివరాలు తాజాగా బయటకు వెల్లడయ్యాయి. అందులోని వివరాలు షాకింగ్ గా ఉన్నాయని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జర్నలిస్టును దారుణంగా హత్య చేశారని, కాలేయం 4 ముక్కలైందని గుర్తించారు. పక్కటెముకలు 5 చోట్ల, తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయని రిపోర్టులో తేలింది. రూ.120 కోట్ల విలువైన రోడ్డు కాంట్రాక్టులో అవినీతి జరిగిదని ముకేశ్ వరుసగా కథనాలు ప్రసారం చేశాడు. ఆ కొన్ని రోజులకే కాంట్రాక్టర్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో జర్నలిస్టు డెడ్ బాడీ లభ్యమైంది. నాటి నుంచి కాంట్రాక్టర్ పరారీలో ఉండగా తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.