కరోనా వైరస్ వల్ల పిండంపై ప్రభావం, గర్భస్రావం: స్టడీ

-

కరోనా వైరస్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే గర్భిణీలపై కూడా కరోనా వైరస్ ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్త్ పరిశోధన చేయడం జరిగింది. ఇక ఈ రీసెర్చ్ కి సంబంధించి వివరాలలోకి వెళితే..

కడుపులో ఉండే పిండానికి కూడా కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని తేలింది. అయితే కరోనా వైరస్ బారిన పడ్డ తల్లులు ద్వారా ఇది వస్తుంది మరియు లాబరేటరీలో చేసే ఐవిఎఫ్ ప్రొసీజర్ ద్వారా కూడా మిస్ క్యారేజ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అయితే ఎన్ని మిస్ క్యారేజ్లు అయ్యాయి అనే దానికి సంబంధించి ఎటువంటి డేటా లేదు. అయితే డాక్టర్ దీపక్ మోదీ చెప్పిన దాని ప్రకారం కరోనా వైరస్ వచ్చిన తల్లి నుండి గర్భంలో ఉండే పిండానికి కరోనా వైరస్ సోకుతుంది అని తెలుస్తోంది. అయితే ఇలా జరగడం వల్ల కడుపులో ఉండే పిండం చనిపోవచ్చు అని అంటున్నారు డాక్టర్లు.

అదే విధంగా గైనకాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం మొదటి లేదా రెండవ ట్రైమిస్టర్ లో ఈ మిస్ క్యారేజ్ జరిగే అవకాశం ఉందని చెప్పారు. అయితే కరోనా వైరస్ అనేది వెర్టికల్ ట్రాన్స్మిషన్ అంటే తల్లి నుంచి శిశువుకు సోకుతుంది. ఐవిఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళ పై కూడా ప్రభావం చూపిస్తుంది. అయితే ఏది ఏమైనా కచ్చితంగా కరోనా వైరస్ సోకుతుంది అని చెప్పలేము.

ఎందుకంటే కరోనా బారినపడ్డ గర్భిణీలు వేయమంది శిశువులకు జన్మనిచ్చారు. కొంతమందిలో అయితే మిస్ క్యారేజ్ అవ్వడం చూసాము అని అన్నారు. IVF పద్ధతి ద్వారా బిడ్డను కనాలనుకొనే వాళ్ళకి అయితే పిండానికి ఇన్ఫెక్షన్ సోకి ఇబ్బంది పడే అవకాశం ఉంది.

దీనితో సమస్య వస్తుంది. అదే విధంగా ఒకవేళ కనుక తల్లి కరోనా వైరస్ తో బాధ పడితే అప్పుడు కరోనా వైరస్ తగ్గే వరకు కూడా తల్లిని ఆగమంటున్నారు డాక్టర్లు. ఇలా పూర్తిగా ఆ తల్లి కోలుకునే దాకా ట్రీట్మెంట్ ని ఆపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version