వైసీపీ, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వెళ్లబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో రహస్య మంతనాలు చేశారట మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఇందులో భాగంగానే… లోటస్ పాండ్‌లోని షర్మిల నివాసంలో దాదాపు 3 గంటల పాటు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి భేటీ జరిగినట్లు సమాచారం అందుతోంది.
ఈ తరుణంలోనే… కాంగ్రెస్ పార్టీలోకి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వెళ్లబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే.. హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి రహస్య మంతనాలు చేసిన వార్తలపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా స్పందించలేదు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. నాలుగు రోజుల కిందట.. రాజకీయాలకు, వైసీపీ పార్టీ, ఎంపీ పదవిని కాదని రిటైర్మెంట్ తీసుకున్నారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.