శుభవార్త.. కరోనాకు మెడిసిన్‌ వచ్చిందోచ్‌..!

-

కరోనా మహమ్మారి వేళ భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలకు భారత ఫార్మా దిగ్గజ కంపెనీ గ్లెన్‌ మార్క్‌ శుభవార్త చెప్పింది. కోవిడ్‌ 19 మెడిసిన్‌ను తయారు చేసినట్లు వెల్లడించింది. ఇప్పటికే ఈ మెడిసిన్‌కు గాను ఆ కంపెనీ 3 దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టింది. అవన్నీ విజయవంతం అయ్యాయి. దీంతో ఆ కంపెనీ కరోనా మెడిసిన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.

కాగా ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ మెడిసిన్లపై గ్లెన్‌మార్క్‌ పరిశోధన చేసింది. ఫవిపిరవిర్‌ మెడిసిన్‌ చాలా తక్కువ, మధ్యమ లక్షణాలతో బాధపడుతున్న కరోనా రోగులపై బాగా పనిచేస్తుందని గుర్తించారు. ఈ క్రమంలోనే ఫాబిఫ్లూ పేరిట ఓ మెడిసిన్‌ను మార్కెట్‌లోకి తేనున్నారు. దీనికి గాను ఆ కంపెనీ భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులను ఇప్పటికే పొందింది. ఈ క్రమంలో కరోనా మెడిసిన్‌ మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.

కాగా దేశవ్యాప్తంగా ఈ మెడిసిన్‌ను ఆ కంపెనీ వీలైనన్ని ఎక్కువ డోసుల్లో ప్రస్తుతం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ ఉన్నవారికి మాత్రమే ఈ మెడిసిన్‌ను విక్రయించనున్నారు. ఒక్కో ట్యాబ్లెట్‌ ఖరీదు రూ.103 గా నిర్ణయించారు. కరోనా ఉన్నవారు 1800 ఎంజీ పరిమాణంలో నిత్యం ట్యాబ్లెట్లను వేసుకోవాలి. తొలి రోజు రెండు సార్లు ట్యాబ్లెట్లు వేసుకోవాలి. తరువాత వరుసగా 14 రోజుల పాటు 800 ఎంజీ మోతాదులో ట్యాబ్లెట్లను రోజుకు 2 సార్లు వేసుకోవాలి.

అయితే డయాబెటిస్‌ రోగులు కూడా ఈ మెడిసిన్‌ను వాడవచ్చని ఆ కంపెనీ తెలిపింది. ఇక కరోనాకు గాను ఫాబిఫ్లూనే తొలి ఓరల్‌ మెడిసిన్‌ అని ఆ కంపెనీ తెలిపింది. ఈ మెడిసిస్‌ను క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా కరోనా రోగులకు ఇచ్చినప్పుడు పాజిటివ్‌ ఫలితాలు వచ్చాయన్నారు. కరోనా లక్షణాలు చాలా తక్కువగా లేదా ఒక మోస్తరుగా ఉన్నా ఈ మెడిసిన్‌ పనిచేస్తుందన్నారు. అలాగే డయాబెటిస్‌, గుండె జబ్బులు ఉన్నవారు కూడా ఈ మెడిసిన్‌ను వాడుకోవచ్చని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కేవలం 4 రోజుల్లోనే వైరస్‌ దాదాపుగా నశిస్తుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version