దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటికే 160 కోట్ల డోసులకు పైగా వ్యాక్సినేషన్ అందించారు. కరోనాను నియంత్రించాలంటే వ్యాక్సినేషనే ప్రధాన ఆయుధమని ప్రభుత్వం నమ్ముతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాాలు వ్యాక్సినేషన్ పై ఎక్కువ శ్రద్ధ కనిపిస్తున్నాయి. ఇటీవలే వ్యాక్సినేషన్ ప్రారంభమై ఏడాది పూర్తయింది. ప్రస్తుతం జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల మధ్య ఉన్న టీనేజర్లకు వ్యాక్సినేషన్ అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే వ్యాక్సినేషన్ లో ఇండియా రికార్డ్ క్రియేట్ చేసింది. దేశంలోని 16 రాష్ట్రాలు/ యూటీలు 100 శాతం మొదటి డోసులును పూర్తి చేసుకున్నాయి. మరో నాలుగు రాష్ట్రాలు 96-99 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకున్నాయి. వంద శాతం పూర్తి చేసుకున్న వాటిలో చంఢీగర్, లక్షద్వీప్, గోవా, దాద్రానగర్ హవేలీ, అండమాన్ నికోబార్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు/యూటీలు ఉన్నాయి. 96-99 శాతం వ్యాక్సినేషన్ పూర్తయిన రాష్ట్రాల్లో గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, లడఖ్ ఉన్నాయి. మొత్తంగా ఇండియాలో తొలి డోస్ వ్యాక్సినేషన్ 96 శాతం పూర్తయింది.