షాకింగ్: మే 3 ఫైనల్ కాదు… 15 ?

-

మొదలుపెట్టినప్పుడు ఒక్క రోజే.. ఆ ఒక్క ఆదివారమే అనుకున్నారు అంతా! అవగాహనా రాహిత్యంతో కొంతమంది ఆ ఆదివారం సాయంత్రం ర్యాలీలు కూడా చేపట్టేశారు! ఇంతలోనే 21 రోజులు అని కేంద్రం నుంచి ప్రకటన. తేరుకునేలోపు కరోనా అల్లకల్లోలం! దీంతో మరో 19 రోజులు పెంచాల్సిన పరిస్థితి… దాంతో మే 3వ తేదీ వరకూ లాక్ డౌన్! అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చూస్తుంటే అది కూడా అనుమానమే… మే 4 నుంచి కూడా కష్టమే అనే సంకేతాలు వెలువడుతున్నాయి!

తాజాగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రులు, రైల్, విమాన ప్రయాణాలను మే 15 తరువాత అనుమతించే ఆలోచన చేయాలని సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. మే 3 తర్వాత ఎవరి రొటీన్ లైఫ్ లో వారు బిజీ అయిపోతారు అని భావించిన ఆలోచనలు అన్నీ జరిగేటట్టు లేదని… లాక్ డౌన్ ఎత్తడం అనేది ప్రస్తుతానికి ఎండమావే అనే సంకేతాలు కేంద్ర పెద్దల మాటలలోని అర్ధాలుగా అగుపిస్తున్నాయి! ఈ విషయాలపై తాజాగా స్పందించిన ఒక కేంద్ర సీనియర్ అధికారు… మే 4 నుంచి కూడా ప్రయాణ ఆంక్షలు ఉండవచ్చు… మే 15 తర్వాతే పరిస్థితులపై ఒక క్లారిటీ రావొచ్చు అనే స్థాయిలో మాట్లాడటం షాకింగ్ న్యూస్ అయ్యిందనే చెప్పాలి.

ప్రజా రవాణా పునరుద్ధరణ అంటే, లాక్ డౌన్ పూర్తిగా తొలగినట్టుగా భావించవచ్చు అనే భావన అందరిలో ఉండటం.. ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుగుణంగా లేకపోవడంతో… మె 3 ఫైనల్ అనే విషయం ఎవరూ ఫిక్సవకపోవడమే మంచిదేమో! ఈ సంగతులు ఇలా ఉంటే… ఎయిర్ ఇండియా మే 4 నుంచి దేశవాళీ సర్వీసులకు, జూన్ 1 నుంచి విదేశీ సర్వీసులను టికెట్ల బుకింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే… ఎవరి అంచనాలకూ అందకుండా ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజు రోజుకీ గణనీయంగా పెరిగిపోతున్న పాజిటివ్ కేసులు మే 3 ను మే 15కి తీసుకెళ్తాయేమో చూడాలి మరి!!

Read more RELATED
Recommended to you

Exit mobile version