మోదీపై దీదీ కోపం – పశ్చిమబెంగాల్‌కు శాపం

-

వెస్ట్‌ బెంగాల్‌లో అసలు లాక్‌డౌన్‌ నిబంధనల అమలు లేనేలేదని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసినా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు.

పెళ్లి, సుబ్బి చావుకొచ్చినట్లు’గా ఉంది పశ్చిమ బెంగాల్‌ ప్రజల పరిస్థితి.  దీదీకి ప్రధాని మోదీతో ఉన్న గొడవకు రాష్ట్ర ప్రజలను బలిచేస్తున్నట్లుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న లాక్‌డైన్‌ నిబంధనలను పశ్చిమ బెంగాల్లో పూర్తిగా బేఖాతరు చేస్తున్నట్లు బేజేపీ ఆరోపిస్తోంది.

వెస్ట్‌ బెంగాల్లో అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం 213 మొత్తం కేసులు కాగా, 169 చికిత్స పొందుతున్నవి, 37 మంది కోలుకున్నారు. ఏడుగురు మరణించినట్లుగా తెలిసింది. కానీ, ఈ సమాచారం పూర్తిగా తప్పులతడక అని కేంద్రం భావిస్తోంది. ఉద్ధేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం కేసుల అసలు వివరాలు తొక్కిపెడుతోందని, తమకు ఖచ్చితమైన సమాచారం తన స్వంత వనరుల ద్వారా లభిస్తోందని కేంద్రం తెలిపింది. గత వారంలో రెండు సార్లు కేంద్ర హోం శాఖ బెంగాల్‌ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఆక్షేపించింది. లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారని మండిపడింది.

అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు కేంద్రం చెబుతున్నట్లుగానే ఉన్నట్లు తెలుస్తోంది.. వివిధ జాతీయ టివి చానెళ్లు, పత్రికలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో, కోల్‌కతాలో పర్యటిచంఇ పరిస్థితులను పరిశీలించగా, ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలను ఏమాత్రం పాటించడంలేదని తెలిసింది. ముస్లింలు యథావిధిగా నమాజ్‌లకోసం మసీదుల్లో పెద్దయెత్తున గుమిగూడుతున్నారని, షాపుల వద్ద, కూరగాయల మార్కెట్ల వద్ద, ప్రత్యేకించి చేపల మార్కెట్లలో వందలాదిమంది చాలా మామూలుగా తిరుగుతున్నారని మీడియా ఆందోళన వ్యక్తం చేసింది. ఎక్కడా పోలీసులు ఎటువంటి చర్యా తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని, బహుశా వారికి అదేవిధమైన ఆదేశాలు వచ్చిఉంటాయని మీడియా తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు ఇవ్వాల్సిన హెల్త్‌ బులెటిన్‌ను కూడా రోజూ ఇవ్వడంలేదని, ఇచ్చినంతవరకు కూడా తప్పులతడకలేనని బిజీపీఐటీ సెల్‌ హెడ్‌ అమిత్‌ మాలవ్య ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా రోగులకు చికిత్సనందిస్తున్న ప్రయివేటు ఆసుపత్రులను సమాచారాన్ని దాచాల్సిందిగా బెదిరిస్తున్నారని ఆయన ఆన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ని వివరాలు తప్పేనని ఆయన వాదన. రోగుల పట్ల కూడా చాలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, ఒక కరోనా పేషెంటును ఎన్‌ఆర్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీలో జనరల్‌ మెడిసిన్‌ వార్డులో చేర్చుకుని, కరోనా అని తెలిసినా, ఐసొలేషన్‌కు తరలించకుండా ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఆ రోగి చనిపోయాడని అమిత్‌ ఆవేదన వ్యక్తం చేసాడు.

ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్లో కరోనాను కట్టడి చేయలేకపోతే, అది దేశానికే ప్రమాదకరంగా పరిణమిస్తుందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైనందువల్ల ఆర్టికల్‌ 356 ప్రకారం కేంద్రం,  రాష్ట్రపతి పాలన విధించబోతోందని వార్తలు వెలువడ్డాయి. అయితే, ఇది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికంటే, మమతా బెనర్జీకే సానుభూతిని పెంచే అవకాశముందని భావించిన బీజేపీ ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్లు తెలిసింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version