కరోనా బారిన పడ్డ పురుషుల్లో కొత్త సమస్య… హెచ్చరిస్తున్న నిపుణులు….!

-

తాజాగా చేసిన పరిశోధన ప్రకారం ప్రకారం కరోనా వలన అంగస్తంభన (ఈడి) ఇబ్బంది ఉంటుందని చెప్పారు. డయాబెటిస్, ఎక్కువ బీఎంఐ మరియు ధూమపానం వలన ఈ రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు.

ఈ డేటా ప్రకారం కరోనా వైరస్ సోకిన వాళ్ళల్లో 5.62 మార్లు ఈ సమస్య రావడానికి అవకాశం ఉందని చెప్పారు. అయితే ఈ సమస్య ఎక్కువ కాలం అయినా ఉండొచ్చు లేదా తక్కువ కాలం మాత్రమే ఉండొచ్చు అనే రీసర్చర్లు చెప్పారు.

చీఫ్ యూరాలజిస్ట్ దీనికి సంబంధించి ఎటువంటి పరిశోధన ఇండియా లో జరగ లేదని కరోనా వైరస్ తర్వాత ఇటువంటి సమస్య వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఎండోక్రినాలజీ మరియు మెడికల్ టెక్నాలజీ ప్రొఫెసర్ భారత దేశం లో కాకుండా వివిధ దేశాల్లో దీనికి సంబంధించి పరిశోధనలు జరిగినట్లు చెప్పారు.

కొంతమంది పురుషులు కరోనా తగ్గిన తర్వాత ఇటువంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. అయితే ఇది కొందరిలో వేగంగా తగ్గి పోవచ్చు మరియు కొందరు లో ఎక్కువ కాలం ఉండొచ్చు అంటున్నారు.

ఇద్దరు పేషంట్లుకి ఇలా జరిగిందని వాళ్ళని చూస్తే మూడు నెలలు ఉందని మూడు నెలలు తర్వాత వాళ్ళు నార్మల్ గా సెక్స్ లైఫ్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. రోజు రోజుకి కేసులు ఎక్కువై పోతున్నాయని.. కరోనా బారిన పడ్డ పురుషులకు ఈ సమస్య ఉన్నట్లు వెల్లడించారు. కాబట్టి పురుషులు మరింత జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version