మున్సిపల్ కమిషనర్‌ను దూషించిన కాంగ్రెస్ నేత.. కార్మికుల నిరసన

-

వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తాండూర్ మున్సిపల్ కమిషనర్‌ను అసభ్య పదజాలంతో స్థానిక కాంగ్రెస్ నేత ఒకరు దూషించారు. దీంతో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు.

కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా మంగళవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డిని అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలిసింది. ఈ విషయం బయటకు రావడంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తూ మున్సిపల్ కమిషనర్‌కు కార్మికులు సంఘీభావం ప్రకటించారు.హబీబ్ లాలా వెంటనే కమిషనర్‌కు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయమై తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
సమస్యను తాను పరిష్కరిస్తానని కార్మికులంతా విధులకు హాజరుకావాలని ఫోన్ ద్వారా కాంగ్రెస్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి కార్మికులను కోరినట్లు తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version