భారత్ మేలు మ‌రిచిపోము : ట్రంప్‌

-

భార‌త‌దేశం, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చేసిన మేలును తామెప్ప‌టికీ మ‌రిచిపోలేమ‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ క్లిష్ట‌ప‌రిస్థితుల్లో తాను అభ్య‌ర్థించిన ఔష‌ధం హైడ్రాక్సీక్లోరోక్విన్ ఎగుమ‌తులకు ప‌చ్చ‌జెండా ఊపి, అమెరికాకు 2.9కోట్ల డోసుల‌ను పంపినందుకు ట్రంప్ ట్విట‌ర్ ద్వారా ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ట్రంప్ ప్ర‌త్యేక ప‌రిస్థితులు స్నేహితుల మ‌ధ్య స‌న్నిహిత స‌హ‌కారాన్ని ఆశిస్తాయి. హెచ్‌సిక్యూ మాకు పంపినందుకు భార‌త్‌కు, భార‌త పౌరుల‌కు ధ‌న్య‌వాదాలు. ఈ మేలు మేం మ‌రిచిపోం. ఈ పోరాటంలో మీ నాయ‌క‌త్వ ప‌టిమ ఒక్క భార‌త్‌కే కాకుండా మాన‌వ‌త్వానికే స‌హాయం చేస్తున్నందుకు ప్ర‌ధాని మోదీ… మీకు మా కృత‌జ్ఞ‌త‌లు అని ట్విట‌ర్‌లో పోస్ట్ చేసారు. దీనికి ప్ర‌తిస్పందించిన మోదీ, క‌రోనాపై మాన‌వ‌త్వ‌పు పోరులో భార‌త‌దేశం చేయ‌గ‌లిగిన సాయమంతా చేస్తుంది. మ‌నం దీన్ని గెలిచితీరాలి అన్నారు.

శ్వేత‌సౌధంలో త‌న రోజువారీ విలేక‌రుల సమావేశంలో మాట్లాడుతూ, ట్రంప్‌, మోదీని గొప్ప నాయ‌కుడిగా అభివ‌ర్ణించారు. హెచ్‌సీక్యూపై ఎగుమ‌తుల నిషేధాన్ని ఎత్తివేసినందుకు ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేసారు. 30కి పైగా దేశాలు ఈ ఔష‌ధాన్ని త‌మ‌కు పంపాల్సిందిగా కోరాయి. గుజ‌రాత్‌లోని మూడు కంపెనీలు దాదాపు 3 కోట్ల డోసుల హెచ్‌సీక్యూను అమెరికాకు పంపించాయి. అవి బ‌య‌లుదేరాయ‌ని, కాసేప‌ట్లో త‌మ‌కు అందుతాయ‌ని ట్రంప్ ధృవీక‌రించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version