వైరల్ వీడియో; కారు డ్రైవర్ కి చెమటలు పట్టించిన సింహాల గుంపు…!

-

ఈ కరోనా గోలలో పడి జనాలకు వినోదం అనేది లేకుండా పోయింది. వైరల్ వీడియోస్ ని కూడా జనం పెద్దగా చూడటం లేదు ఈ మధ్య కాలంలో. అవి కూడా పెద్దగా విడుదల కావడం లేదు కూడా. తాజాగా ఒక వీడియో బయటకు వచ్చింది. సింహం, దాని పిల్లలతో కలిసి గడ్డి మైదానాల నుంచి బయటకు వచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌ కు చెందిన అధికారి సుశాంత నందా…

తన ట్విట్టర్ లో గురువారం ఒక నిమిషం వీడియోను పోస్ట్ చేసారు. సింహాల కుటుంబం గడ్డి భూములు అవతలి వైపుకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా… ఒక కారు అటు వైపు నుంచి వస్తుంది. వాటిని చూసిన డ్రైవర్ కారుని ఆపేసాడు. అప్పుడు నిదానంగా సింహాల గుంపు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. ఆ సింహాల గుంపు ని చూసిన డ్రైవర్ కి చెమటలు పట్టాయి. “పిల్లలను లెక్కించడం కొనసాగించండి. ఒకేసారి చాలా మందిని చూడట౦ మనోహరమైన దృశ్యమని పోస్ట్ చేసారు.

ఈ వీడియో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలో వేల వ్యూస్ సాధించింది. కొంత మంది… డ్రైవర్ కి గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంది అని కామెంట్ చేయగా మరికొందరు… “అమేజింగ్, నేను 13-14 పిల్లలను లెక్కించగలను” అని ఒకరు కామెంట్ చేసారు. “వారి బంధువులతో కూడిన భారీ కుటుంబం రహదారిని దాటుతోందని మరొకరు కామెంట్ చేసారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version