కరోనా వ్యాక్సిన్ వద్దంటున్న రష్యన్లు…!

-

కరోనా వ్యాక్సిన్ విషయంలో రష్యా చాలా వేగంగా అడుగులు వేసింది. సమర్ధవంతంగా కరోనా వ్యాక్సిన్ ని ఆ దేశం తయారు చేసింది. అయితే ఆ దేశంలో మాత్రం కరోనా వ్యాక్సిన్ ని వేసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదట. రష్యాలో ఒక సర్వే ప్రకారం, టీకా అందుబాటులోకి వచ్చిన తర్వాత రష్యన్లు అధిక సంఖ్యలో కోవిడ్ -19 కు టీకాలు వేసుకోవడానికి ఇష్టపడటం లేదని తెలిసింది.

పోల్స్టర్ లెవాడా సెంటర్ నిర్వహించిన పోల్ లో ఈ విషయం వెల్లడి అయింది. అక్టోబర్ 20 నాటికి 59% రష్యన్లు టీకాను తిరస్కరించారు అని ఇది రెండు నెలల క్రితం 54% గా ఉంది అని వెల్లడించారు. ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్‌ ను స్పుత్నిక్ విని ఆ దేశం తయారు చేసింది. అయితే ఇంకా వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తి కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news