సౌదీకున్న జ్ఞానం పాక్ కి లేకుండా పోయిందే!

-

మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో మతపరమైన సమావేశాలు, సామూహిక ప్రార్థనలపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రంజాన్‌ మాసం సమీపిస్తున్న తరుణంలో సామూహిక ప్రార్థనలు రద్దు చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా ఇతర వైద్య నిపుణులు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇదే క్రమంలో భారత్ లో కూడా పూర్తిగా ఆంక్షలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మత గురువుల ఒత్తిళ్లకు తలొగ్గిన పాక్ సర్కార్ మాత్రం మసీదుల్లో రంజాన్‌ ప్రార్థనలకు అనుమతి ఇచ్చేసింది! ఇదే క్రమంలో మరో ముస్లిం దేశమైన సౌదీ మాత్రం కీలక నిర్ణయాలు తీసుకుంది!

రంజాన్‌ మాసం మొదలుకానున్న తరుణంలో మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు పాక్ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మత గురువులతో ఆన్‌ లైన్‌ లో చర్చలు జరిపినా కూడా ప్రయోజనం లేకపోయే సరికి ప్రభుత్వం వారి ఒత్తిళ్లకు తలొగ్గక తప్పలేదు. ఆ దేశం పరిస్థితి అలా ఉంటే.. రంజాన్ మాసంలో పవిత్ర మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూసివేయాలని సంచనల నిర్ణయం తీసుకుంది సౌదీ అరేబియా. కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తుందన్న కారణంతోనే మసీదులను మూసేయాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కాగా, ఇప్పటివరకూ సుమారు 10 వేల మందికి పైగా సౌదీ అరేబియన్స్ కరోనా బారిన పడగా, వారిలో 100 మందికి పైగా మరణించారు. ఈ మరణాల సంఖ్య పాక్ లో ఏకంగా 176 గా ఉంది!! ఈ సంగతులు తెలిసినవారు మాత్రం… సౌదీ అరేబియాకు ఉన్న జ్ఞానం.. పాకిస్థాన్ కు లేకుండా పోయిందే అని కామెంట్లు చేస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version