క్రిటికల్ గా కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్యం !

-

కేంద్ర ఆయూష్ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్టు చెబుతున్నారు. ఆయనకు కొద్ది రోజుల క్రితం కరోనా సోకిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన గత 10 రోజులుగా గోవాలోని మణిపాల్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ రోజు అకస్మాత్తుగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోయినట్లు వైద్యులు ఒక ప్రకటన చేశారు. అలానే తమ వల్ల కావడం లేదని తెలపడంతో ఢిల్లీ ఎయిమ్స్ నుండి ప్రత్యేక వైద్యుల బృందం ఒకటి గోవా వెళ్లినట్టు చెబుతున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ కి తరలించేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో అని వైద్యుల బృందం పరిశీలిస్తోంది.

కేంద్ర మంత్రి తాజా ఆరోగ్య పరిస్థితి వివరాలను గోవా సీఎం ప్రమోద్ సావంత్ వెల్లడించారు. మిగతా కేంద్ర మంత్రులకు భిన్నంగా శ్రీపాద్ నాయక్ కరోనా లక్షణాలేవీ లేకుండానే పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. ఆయన కరోనా సోకినా రోజున ”ఇవాళ కొవిడ్ టెస్టులు చేయించుకున్నాను. లక్షణాలు లేకున్నా పాజిటివ్ అని వచ్చింది. ఎలాంటి అనారోగ్యం లేదు కాబట్టి హోం ఐసోలేషన్ లోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. గడిచిన కొద్ది రోజులుగా నాతో కాంటాక్ట్ లోకి వచ్చినవాళ్లంతా దయచేసి జాగ్రత్తలు తీసుకోండి” అని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news