కరోనా లేదు గిరోనా లేదు, హోలీ ఫస్ట్…!

-

మన భారత్ లో కొన్ని కొన్ని ఆశ్చర్యంగాను వింతగానూ ఉంటాయి. ప్రాణం మీదకు వస్తే ఆరోజు భయపడతారు గాని ఆ తర్వాత మాత్రం ఏ భయాలు లేకుండా ముందుకి వెళ్తారు. ఎవరైనా తెలిసిన వారికి రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే హెల్మెట్ కొని తలకు పెట్టుకుంటారు. ఆ తర్వాత ఇక హెల్మెట్ కి దుమ్ము పట్టి ఏ పాత సైకిల్ మీదో పడేసి… వర్షా కాలం కళ్ళల్లో నీళ్ళు పడకుండా తల తడవకుండా వాడతారు.

అలాంటి జనం ఉన్నారు మన దేశంలో. తాజాగా కరోనా వైరస్ అనగానే జనాలు మొహాలకు కవర్లు తొడుక్కుని కూడా తిరిగారు. పాపం ఎండలో వైరస్ చచ్చిపోతుంది అని తెలిసి రోడ్డు పక్కన నడి ఎండలో గొడుగు పట్టుకుని కూర్చున్నారు. జలుబు దగ్గు వచ్చిన వాళ్ళు. ఇక మీడియా పావలా జరిగితే రూపాయి చేస్తుంది కాబట్టి ఇంకా హైరానా పడిపోయారు జనాలు. చికెన్ తినొద్దు అంటే అమ్మో అమ్మో చికెన్ మాకు వద్దంటే వద్దన్నారు.

అలాంటి జనం ఇవ్వాళ హోలీ అనగానే రోడ్ల మీదకు వచ్చేశారు. ఎక్కడా భయపడలేదు వెనక్కు తగ్గలేదు. హోలీని చక్కగా సంతోషంగా జరుపుకున్నారు. ఈ ఏడాది ప్రధానమంత్రి, రాష్ట్రపతి హోలీ సంబరాలు జరుపుకోకపోయినా, దేశ ప్రజలు మాత్రం చక్కగా హోలీ చేసుకుంటున్నారు. కరోనా లేదు గిరోనా లేదు అంటూ హోలీ ఫస్ట్ అంటూ సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు జనాలు. దాదాపు అన్ని ప్రాంతాల్లో హోలీ చక్కగా చేసుకున్నారు.

పాపం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, సాక్షాత్తు రాష్ట్రపతి, ఢిల్లీ ముఖ్యమంత్రి, బిజెపి ఎంపీలు కరోనా ఉంది కాబట్టి హోలీ వద్దని చెప్పినా సరే వినలేదు. హోలీ కోసం యువత, పెద్ద, పిల్ల అనే తేడా లేకుండా రోడ్ల మీదకు వచ్చారు. నిన్నటి వరకు జరగని రంగుల అమ్మకాలు నేడు జరిగాయి. దాదాపు దేశం మొత్తం ఇదే విధంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. మనోళ్ళు గ్రేట్ సామి, వాళ్ళు అనుకుంటే జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version