బ్రేకింగ్; సిఎంకి షాక్ 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా…!

-

19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కి షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్ లో ప్రభుత్వం కూలిపోవడానికి సిద్దంగా ఉంది. 15 నెలలుగా ఎప్పుడు కూలిపోతుందా అని ఎదురు చూసిన కమల్ నాథ్ ప్రభుత్వాన్ని ఎలా అయితే బిజెపి కూల్చింది. నమ్మకమైన నేతను తమ వైపుకి తిప్పుకుని పార్టీకి షాక్ ఇచ్చింది.

ఏకంగా జ్యోతిరాదిత్య సిందియాకు రాజ్యసభ సీటు తో పాటుగా కేంద్ర మంత్రి పదవిని ఆఫర్ చేసింది బిజెపి అధిష్టానం. తన వర్గంలో ఉన్న 19 మంది ఎమ్మెల్యేలను ఆయన బయటకు తీసుకురావడంలో సఫలం అయ్యారు. 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంగళవారంనాడు పార్టీకి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను రాజ్ భవన్‌కు పంపారు. వీరంతా జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులుగా శాసన సభ్యులు కావడం గమనార్హం.

దీనితో ప్రభుత్వం కూలిపోవడం ఖాయంగా కనపడుతుంది. ఎమ్మెల్యేలు ఇలా అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం తో కమల్ నాథ్ ఎం చెయ్యాలో అర్ధం కాని స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సింధియా నమ్మకమైన మిత్రుడు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ నుంచి తప్పుకోవడం తో ఇప్పుడు అధిష్టానం కూడా ప్రభుత్వ మనుగడ మీద ఆశలు వదిలేసింది కాంగ్రెస్.

మరి వీరిని స్పీకర్ లేదా గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనేది చూడాలి. వాస్తవానికి స్పీకర్ పరిధిలోని అంశం ఎమ్మెల్యే రాజీనామా. కాని వాళ్ళు అనూహ్యంగా రాజభవన్ కి పంపడం వెనుక కారణం ఎమై ఉంటుంది అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కమల్ నాథ్ మాట్లాడుతున్నారు. సీనియర్ నేతలు కూడా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version