కార్తీక మాసంలో ఈ దీపాన్ని వెలిగిస్తే.. డబ్బుకు లోటు ఉండదు..!

-

కార్తీకమాసం శివుడికి ఎంతో ఇష్టం. అన్ని నెలల్లో కంటే కార్తీకమాసం ఎంతో గొప్పది. అందుకే కార్తీక మాసంలో భక్తులు ఎంతో శ్రద్దగా పూజలు చేస్తారు. హిందూ మత విశ్వాసం ప్రకారం, ఈ నెలలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన వంటివి ఎంతో పుణ్యం వస్తుంది. అందరూ దేవాలయాల్లోని, ఇంటి గుమ్మం ముందు దీపాలని పెడుతూ ఉంటారు. అయితే కార్తీకమాసంలో ఇలా దీపం పెట్టడం వలన ఎంతో మంచి జరుగుతుందట. నారికేళ దీపాన్ని వెలిగించడం వలన శివుని అనుగ్రహం కలుగుతుంది. కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే ఈ దీపాన్ని పెట్టొచ్చు.

సాయంత్రం పూట పూజ గదిలో ఈ దీపం పెట్టడం వలన మంచి జరుగుతుంది. నారికేళ దీపాన్ని పెట్టాలంటే ముందు పూజ మందిరాన్ని శుభ్రం చేసుకుని, అందంగా అలంకరించుకుని తర్వాత పరమేశ్వరుడు చిత్రపటాన్ని కానీ లింగ స్వరూపానికి కానీ బొట్టు పెట్టి పుష్పాలని సమర్పించాలి. శివుని ముందు ఒక పీట వేసి పళ్లెం పెట్టాలి. దానికి బొట్లు పెట్టాలి. తర్వాత గంధంతో స్వస్తిక్ గుర్తును వేయాలి.

స్వస్తిక్ గుర్తు మీద బియ్యాన్ని పోసి ఒక కొబ్బరికాయని పెట్టి పసుపు నీళ్లతో శుభ్రం చేసే పగలగొట్టాలి. తర్వాత కొబ్బరి చెక్కల్ని పళ్లెంలో బియ్యం పై ఉంచి అందులో కొబ్బరి చిప్పకు బొట్లు పెట్టి కొబ్బరి చిప్పలులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేయాలి. తర్వాత మూడు వత్తులని కలిపి దీపారాధన చేయాలి. ఒక వత్తి ఉత్తరం, ఇంకోటి ఈశాన్యం, మూడవది తూర్పు వైపు ఉంచాలి. తర్వాత ధూపం ఇచ్చేసి దారిద్య దుఃఖ దహనాయ నమః శివాయ అని 21 సార్లు చెప్పాలి/ ఏదైనా తీయటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు నుంచి గట్టెక్కచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version